జీవితానికి దగ్గరగా..! | near to life | Sakshi
Sakshi News home page

జీవితానికి దగ్గరగా..!

Published Fri, Feb 28 2014 11:17 PM | Last Updated on Fri, May 25 2018 2:50 PM

జీవితానికి  దగ్గరగా..! - Sakshi

జీవితానికి దగ్గరగా..!

 ఆర్య, నయనతార జంటగా, జై, నజ్రియా నజీమ్ కీలక పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘రాజా రాణి’ అదే పేరుతో తెలుగులో విడుదల కానుంది. అట్లీ కుమార్ దర్శకత్వంలో ఫాక్స్‌స్టార్ స్టూడియోస్, ఎ.ఆర్. మురుగదాస్, ది నెక్ట్స్ బిగ్ ఫిలిం సంయుక్తంగా నిర్మించారు.

 

జీవీ ప్రకాష్‌కుమార్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని ముఖ్య అతిథిగా పాల్గొన్న రానా విడుదల చేసి, చిత్రకథానాయకుడు ఆర్యకు ఇచ్చారు. ఆర్య తనకు మంచి స్నేహతుడని, ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నానని రానా అన్నారు. నిజజీవితానికి దగ్గరగా ఉండే ప్రేమను ఈ చిత్రంలో చూపించామని, అందరికీ నచ్చే చిత్రం అవుతుందని ఆర్య చెప్పారు.

 

ఇది ఎమోషనల్, రొమాంటిక్ కామెడీ మూవీ అనీ, తెలుగువారికి కూడా నచ్చుతుందనే నమ్మకం ఉందని దర్శకుడు అన్నారు. మంచి పాటలివ్వడానికి ఆస్కారం ఉన్న కథ అని, తమిళంలో పెద్ద మ్యూజికల్ హిట్ అయినట్లుగానే తెలుగులోనూ ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని జీవీ ప్రకాష్‌కుమార్ చెప్పారు. భాష తెలియనివారికి కూడా ఈ సినిమా అర్థమవుతుందని, యూనివర్శల్ కథాంశం అని, కథను నమ్మే సినిమా తీశామని ఫాక్స్ స్టార్ సంస్థ ప్రతినిధి శ్రీరామకృష్ణ అన్నారు. ఈ వేడుకలో శ్రీవాస్, అనంత శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement