నయన నోట పెళ్లి మాట | finally nayanatara getting marriage ! | Sakshi
Sakshi News home page

నయన నోట పెళ్లి మాట

Published Wed, Dec 25 2013 3:40 AM | Last Updated on Sat, Sep 2 2017 1:55 AM

నయన నోట పెళ్లి మాట

నయన నోట పెళ్లి మాట

నింగిలోని తారలు ఆహ్లాదాన్ని అందిస్తే నేలపైన తారలు (సినీ తారలు) ఆసక్తిని పెంచుతారనడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా కథానాయికలు పుట్టించే కలకలం అంతా ఇంతా కాదు. వారి వ్యక్తిగత జీవితం కూడా సంచలనమే. ఎవరిని ఎప్పుడు ప్రేమిస్తారో? ఎప్పుడు ఎలా విడిపోతారో, మళ్లీ ఎలా కలుస్తారో చెప్పలేని పరిస్థితి. అయితే అందరూ హీరోయిన్లు ఒకేలా ఉంటారని భావించలేం. నటి నయనతార లాంటి హీరోయిన్లు మాత్రం ఎప్పుడూ ఏదో ఒక ప్రచారంలో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతుంటారు. నటిగా లక్కీగర్ల్ అయిన ఈ బ్యూటీని వ్యక్తిగత జీవితం గురించి ఎలా పోల్చాలో చెప్పడం కష్టమే. 
 
ముందుగా శింబుతో ఆ తరువాత ప్రభుదేవాతో ప్రేమలో మునిగితేలిన నయన ఆ తరువాత ఆ ఇద్దరితోనూ తెగతెంపులు చేసుకుంది. నిజ జీవితంలో ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొన్నప్పటికీ, సినీ జీవితంలో మాత్రం ఎవర్‌గ్రీన్ హీరోయిన్‌గానే వెలుగొందడం విశేషం. సాధారణంగా రీఎంట్రీలో హిట్ లభించడం అరుదు. అలాంటి అరుదయిన సక్సెస్‌ఫుల్ నటి నయన. ప్రేమలో రెండు సార్లు చేదు అనుభవాలను చవిచూసిన ఈ క్రేజీ నటి నోట తాజాగా పెళ్లి మాట వినిపించడం విశేషం. 2014 మే నెలలో తన వివాహం గురించి ప్రకటిస్తానని పేర్కొనడం విశేషం. అయితే వరుడెవరన్న విషయం చిదంబర రహస్యంగా మారింది. కొందరు మాత్రం ఆ లవర్ ఆర్యనే కావచ్చన్న ప్రచారం చేస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement