
వర్మ కథతో...
దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన చిత్రం ‘నేను నేనే రామునే’. రత్నాచారి పమ్మి దర్శకుడు. శ్రీవాణి పమ్మి నిర్మాత. ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఈ ఆలోచన రాగానే... వెంటనే వర్మ దృష్టికి తీసుకెళ్లాం, ఎవరెవరి కథలో సినిమాలుగా వస్తున్నప్పుడు నా కథ సినిమాగా వస్తే తప్పేంటని వర్మ పోత్సహించారు. రామ్‌గోపాల్‌వర్మ ఫేవరెట్ హీరోయిన్ శ్రీదేవి పాత్రను ఇందులో తాను చేశానని సందీప్తి తెలిపారు.