దేశాన్ని అట్టుడికించిన దిశ కేసులో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంతో కేసు ముగిసిపోయిందనుకున్నారు. కానీ ఇది సమంజసం కాదంటూ కొందరు కోర్టు మెట్లెక్కడంతో ఈ ఎన్‌కౌంటర్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓ వైపు పోలీసుల నిర్ణయంపై జనాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేయగా మరోవైపు న్యాయవాదులు, కొందరు ప్రముఖులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. పోలీసులు చట్టాన్ని వారి చేతుల్లోకి తీసుకోరాదని అభిప్రాయపడ్డారు. కాగా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులను పిచ్చి కుక్కలుగా పోల్చిన విషయం తెలిసిందే. అయితే వారిని ఎన్‌కౌంటర్ చేసినప్పుడు మాత్రం భిన్నంగా స్పందించాడు. ఎన్‌కౌంటర్స్ వల్ల పూర్తి న్యాయం జరగదని, అవి పరిష్కార మార్గం కాదని హితవు పలికాడు. అయితే వర్మకు రూటు మార్చడం కొత్తేమీ కాదు.
తాజాగా దిశ కేసు ఎన్‌కౌంటర్‌పై ఓ మీడియా రాసిన సమగ్ర ఆర్టికల్‌ను వర్మ ట్విటర్‌లో షేర్ చేశారు. ఇది వార్త ‘ఎన్‌కౌంటర్ అవసరమా?’ అన్నదానిపై మనలో ఎన్నో ఆలోచనలను రేకెత్తిస్తుందని చెప్పుకొచ్చాడు. ‘నేరస్థులను వెనకేసుకొస్తున్న నువ్వు కూడా ఓ నేరస్థుడివే’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మీరు తీసే సినిమాల వల్లే ఇలాంటి నేరాలు జరుగుతున్నాయని మరో నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కొంతమంది మాత్రం ‘ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు అయిన వర్మ ఇలా మారిపోయాడేంటి’ అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment