న్యూయార్క్ మ్యూజియంలో మూడు మణి ‘రత్నాలు’
ప్రపంచ ప్రసిద్ధ గాంచిన ‘న్యూయార్క్ మ్యూజియం ఆఫ్ ది మూవింగ్ ఇమేజ్’ గురించి విన్నారా? ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సినీ రంగ ప్రముఖులను ఇక్కడ సత్కరిస్తుంటారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రె హ్మాన్ జీవిత చరిత్రను ‘జయహో’ అనే డాక్యుమెంటరీ రూపంలో ఇక్కడ ప్రదర్శించారు.
ఇప్పుడు దర్శకుడు మణిరత్నాన్ని గౌరవించనున్నారు. సామాజిక, రాజకీయ వ్యవస్థలను ప్రతిబింబిస్తూ, ఆయన రూపొందించిన ‘రోజా’, ‘బాంబే’, ‘దిల్‌సే’ చిత్రాలను జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకూ ప్రదర్శించనున్నారు. ఆ తర్వాత నిర్వహించే చర్చా వేదికలో మణిరత్నం కూడా పాల్గోనున్నారు.
‘‘ఆర్ట్, కమర్షియల్, ఎంటర్‌టైన్‌మెంట్... ఇలా సినిమాలను వర్గీకరించే ఈ రోజుల్లో ...అన్ని అంశాలనూ స్పృశిస్తూ సినిమాలు రూపొందించే దర్శకుల్లో మణిరత్నం ఒక రు. ఆయన సినిమాలను మళ్లీ వెండితెర మీద చూస్తూ ఆ మధురానుభూతులను సొంతం చేసుకోవచ్చు ’’ అని మ్యూజియం డిప్యూటీ డెరైక్టర్ క్రిస్టినా మరోడో వ్యాఖ్యానించారు.