
సెప్టెంబర్‌లో నిశ్శబ్దం
చాలా నిశ్శబ్దంగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న చిత్రం నిశబ్దం. నవ నటుడు అజయ్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో నాడోడగళ్ చిత్రం ఫేమ్ అభినయ నాయకిగా నటించారు.ఇతర ముఖ్య పాత్రల్లో బేబీ సాంతన్య, కిషోర్,ప్రముఖ కన్నడ నటుడు రామకృష్ణ, దర్శకుడు ఏ.వెంకటేశ్ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని తిరుమతి ఎంజలిన్ డావన్సీ మిరాకిల్ పిక్చర్స్ పతాకంపై కృపా కితియోన్, జయరతి లారెన్స్,పురట్చి క్లా,వలర్‌మదన్,పెరుమాళ్‌లు కలిసి నిర్మిస్తున్నారు. మైఖెల్‌అరుణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి షాన్ జలీస్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది బెంగుళూర్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న చిత్రం అని చెప్పారు.బెంగళూర్‌లో నివసించే ఒక తమిళ కుటుంబం చుట్టూ తిరిగే కధతో రూపొందిస్తున్న చిత్రం నిశబ్ధం అని తెలిపారు.
ఇది మానవ విలువలను ఆవిష్కరించే చిత్రంగా ఉంటుందన్నారు.ఈ చిత్రం కోసం ఇటీవల కన్నుమూసిన గీత రచయిత నా.ముత్తుకుమార్ రాసిన మన్‌మీదు పొన్నాయ్ వందాయ్ కన్నే అనే పాట ఆయనకు మరిసారి జాతీయ అవార్డును అందిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.చిత్ర షూటింగ్ పూర్తి అయ్యిందని, నిర్మాణాంతర కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయనీ తెలిపారు.చిత్రాన్ని సెప్టెంబర్ చివరిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు మైఖెల్ అరుణ్ తెలిపారు.