ముంబై : బాలీవుడ్ నటి నీతి టేలర్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. తన చిరకాల స్నేహితుడు పరీక్షిత్ బవాను ఆమె వివాహమాడనున్నారు. ఇరు కుటుంబాల సమక్షంలో వీరి నిశ్చితార్థ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఇందుకు సంబంధించిన విశేషాలను నీతి సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన మెహందీ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
ఈ క్రమంలో ఆకుపచ్చ రంగు దుస్తుల్లో మెరిసిపోతున్న ఈ యువ జంటకు సన్నిహితులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఇష్క్‌బాజ్, గులాల్ వంటి హిట్ హిందీ సీరియళ్లలో నీతి నటిస్తున్నారు. అదే విధంగా ఆమె టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలన్న విషయం తెలిసిందే. తనీశ్ హీరోగా నటించిన ‘మేం వయసుకు వచ్చాం’, రాహుల్ రవీంద్రన్ ప్రధాన పాత్రలో నటించిన పెళ్లి పుస్తకం సినిమాలోనూ నీతి హీరోయిన్‌గా నటించారు.
Comments
Please login to add a commentAdd a comment