pelli pustakam
-
ఈ 'పెళ్లి పుస్తకం' మనోరంజకం
సత్సంప్రదాయ భారతీయ దాంపత్య జీవన ఔన్నత్యాన్ని, వైశిష్ట్యాన్ని, కుటుంబ విలువల్ని చాటి చెప్పే మనోరంజకమైన సకుటుంబ కథాచిత్రం 'పెళ్లి పుస్తకం'. రాజేంద్రప్రసాద్ హీరోగా దివ్యవాణి హీరోయిన్గా ప్రముఖ దర్శకులు బాపు తీర్చిదిద్దిన ఓ కుటుంబ కావ్యం. బాపు గీత గీసి, ముళ్లపూడి వెంకటరమణ రాత రాసి, శ్రీకారం చుట్టిన 'పెళ్లి పుస్తకం' 1991 ఏప్రిల్ 1న విడుదలై చరిత్ర సృష్టించింది. కొత్తగా పెళ్లి చేసుకున్న కృష్ణమూర్తి అంటే రాజేంద్రప్రసాద్ ముంబైలోని ఓ సంస్థలో కళా దర్శకుడుగా పని చేస్తుంటాడు. ఇతని భార్య సత్యభామ అంటే దివ్యవాణి కేరళలో స్టెనోగ్రాఫర్‌గా పని చేస్తుంటుంది. అయితే... తమ కుటుంబ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు వీరిద్దరూ కలిసి ఒకే సంస్థలో ఉద్యోగంలో చేరాలని నిర్ణయించుకుంటారు. అలా ఓ పెద్ద సంస్థలో చేరడం కోసం తాము అవివాహితులమని ఆ సంస్థ యజమాని గుమ్మడికి అబద్ధం చెబుతారు. అక్కడ చేరిన తర్వాత వీరు ఎదుర్కొనే సమస్యలే ఈ చిత్రంలోని ప్రధానాంశం.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్) కడుపుబ్బా నవ్వించిన రచనకంపెనీ యజమానిగా గుమ్మడి వెంకటేశ్వరరావు నేనూ... అంటూ మాటమాటని కట్ చేసి వెరైటీ స్లాంగ్‌తో మాట్లాడుతుంటే... గుమ్మడి సంస్థలో పని చేసే ఉద్యోగుల చేత బాబాయిగా పిలిపించుకుంటూ... ఈ సినిమాకు కథను అందించిన రావి కొండలరావు బధిర వార్తలు చదువుతున్నట్లు సైగలతో ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించారు. ఇక గిరి పాత్రలో నటించిన శుభలేఖ సుధాకర్ విషయానికొస్తే... గుమ్మడి బావమరిదిగా.. దివ్యవాణిపై మనసు పడి ఆ తర్వాత అక్కతో తన్నులు తినే సన్నివేశాలు లోలోన నవ్వు పుట్టిస్తాయి.చప్పట్లు కొట్టించిన మాటలుసెకండ్ హీరోయిన్గా వచ్చిన గుమ్మడి కుమార్తె వసుంధర పాత్రలో నటించిన సింధుజా కూడా హీరో రాజేంద్రప్రసాద్ వెంట పడి అతని భార్య దివ్యవాణి అసూయకు కారణమవుతుంది. కానీ సింధుజాది అంతా నటన అని చివరకు తెలుసుకుంటుంది. అలాగే చిత్రంలోని బ్రహ్మచారి గదులకు భామలే అందం, పెళ్లికి పునాది నమ్మకం, గౌరవం, నవ్వొచ్చినప్పుడు ఎవడైనా నవ్వుతాడు... ఏడుపుచ్చినప్పుడు నవ్వేవాడే హీరో, అసూయ అసలైన ప్రేమకి ధర్మామీటర్, నమ్మకం లేని చోట నారాయణా అన్నా బూతులాగే వినిపిస్తుంది... లాంటి డైలాగులు ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ మిస్టరీ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులో)ఏ పెళ్లిలోనైనా ఆ పాటేపాటలైతే చెప్పనక్కరలేదు.. ఆరుద్ర చేతి నుంచి జాలు వారిన 'శ్రీరస్తూ శుభమస్తూ' పాట... అప్పటి వరకు తెలుగు లోగిళ్లలో ఎక్కడ పెళ్లి బాజా మోగినా వినిపించే 'సీతారాముల కళ్యాణం చూతమురా రండి' అంటూ సాగే పాటనే పక్కకు నెట్టేసింది. ఇప్పటికీ తెలుగువారి పెళ్లిళ్లలో ఈ పాటే వినిపిస్తుండడం విశేషం. మామ కేవీ మహాదేవన్ సంగీత దర్శకత్వంలో ట్యూన్ కట్టిన ‘అమ్ము కుట్టి అమ్ము కుట్టి మనస్సులాయో...’, ‘కృష్ణం కలయ సఖి సుందరం...’, ‘పప్పు దప్పళం అన్నం నెయ్యి...’, ‘హాయి హాయి శ్రీరంగ సాయి...’, ‘సరికొత్త చీర ఊహించినాను...’ వంటి పాటలు ప్రేక్షక మహాశయులనే కాదు... సంగీత ప్రియులను కూడా ఓలలాడించాయి. పెళ్లికి అర్థాన్నీ, పరమార్థాన్నీ సున్నితంగా, హృద్యంగా అందంగా, రొమాంటిక్‌గా, అన్నింటినీ మించి హాస్యరసభరితంగా చెప్పిన చిత్రం ఈ ‘పెళ్లి పుస్తకం’.– ఇంటూరు హరికృష్ణ -
భర్తను సర్ప్రైజ్ చేసిన హీరోయిన్
ముంబై: కొత్త పెళ్లికూతురు, నటి నీతి టేలర్ తన భర్త పరీక్షిత్ భవాకు చిరకాలం గుర్తుండిపోయే బహుమతినిచ్చారు. వివాహం జరిగి రెండు నెలలు పూర్తైన సందర్భంగా తన శ్రీవారి పేరును వేలిపై పచ్చబొట్టు వేయించుకుని సర్ప్రైజ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను, వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసిన నీతి.. తన కల నెరవేరిందంటూ అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు. ‘‘ఉంగరపు వేలిపై నా భర్త పేరును పచ్చబొట్టు వేయించుకోవాలని మా పెళ్లైన రోజునే నిశ్చయించుకున్నాను. నేడు నా కోరిక తీరింది. కల నెరవేరింది. నా చిన్ని వేలిపై ఈ పెద్ద పేరును టాటూగా వేయించుకోవడానికి కాస్త కష్టపడాల్సి వచ్చింది. నాలో సగభాగమైన నా భర్తకు నేనిచ్చిన బహుమతులు ఇవే. ఈ చిన్ని కేకుతో పాటు మరెన్నో సెలబ్రేషన్స్’’ అంటూ జీవిత భాగస్వామిపై ప్రేమను చాటుకున్నారు. కాగా ‘మేము వయసుకు వచ్చాం’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన నీతి టేలర్, ఆ తర్వాత రాహుల్ రవీంద్రన్తో కలిసి పెళ్లి పుస్తకం అనే సినిమాలో హీరోయిన్గా నటించారు. అనంతరం టెలివిజన్ స్టార్‌గా మారి బుల్లితెరపై కూడా సందడి చేశారు. ఇష్క్బాజ్, గులాల్ వంటి హిట్ హిందీ సీరియళ్లలో నటించారు.ఇక తన చిరకాల మిత్రుడు పరిక్షిత్ భవాతో గతేడాది ఆగష్టులో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ, ఈ ఏడాది ఆగష్టు 13న అతడిని పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలో అడుగుపెట్టారు.(చదవండి: తల్లి కాబోతున్న ‘అతిథి’ హీరోయిన్) View this post on Instagram Please Swipe Right 👉🏻 For the longest time, it was my dream, that the day I got married I want to get a tattoo of my husband’s name on my ring finger. I have fulfilled my wish🤩🥰❤️ It was a very long name and small fingers, but managed❤️ This is my Second Monthly Anniversary gift to my better half🥰 And yes the cute little cake 🥳🥳 To many more celebrations🍻 #happyanniversary#partitayles A post shared by Nititay (@nititaylor) on Oct 13, 2020 at 5:54am PDT -
‘మా పెళ్లి ఇప్పుడే జరగడం లేదు’
ముందు నుంచీ చెప్పినట్లుగానే తాను ఇండస్ట్రీయేతర వ్యక్తినే పెళ్లి చేసుకోబోతున్నానని బాలీవుడ్ నటి నీతి టేలర్ అన్నారు. హిందీ సీరియళ్లతో పాటు తెలుగు తెరపై తళుక్కుమన్న నీతి ఎంగేజ్మెంట్ మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. భారత ఆర్మీ కెప్టెన్ పరీక్షిత్ బవాను ఆమె వివాహమాడనున్నారు. ఈ క్రమంలో తన నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను నీతి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీంతో ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ వెబ్‌సైట్‌తో మాట్లాడిన నీతి ప్రేమకథ గురించి చెప్పుకొచ్చారు. ‘స్కూలు రోజుల నుంచే పరీక్షిత్ పరిచయం. అప్పుడు మేమిద్దరం మంచి స్నేహితులం. చాలా కాలం దూరంగా ఉన్న మేము కొన్ని నెలల క్రితం ఇన్స్టాగ్రామ్ ద్వారా మళ్లీ కలుసుకున్నాం. అప్పటి నుంచి మా మధ్య సంభాషణ పెరిగింది. ఆ క్రమంలో తను రత్నంలాంటి వాడని తెలుసుకున్నాను. ఢిల్లీకి వెళ్లి తనను కలిశాను. మా అమ్మానాన్న కూడా తనను కలిసి మాట్లాడారు. ఇరు కుటుంబాలు మా బంధానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ప్రతీ విషయంలో మా ఇద్దరి అభిరుచులు, అభిప్రాయాలు ఒక్కటే. ఇండస్ట్రీ వ్యక్తిని కాకుండా బయటి వ్యక్తిని చేసుకుంటానని గతంలో చెప్పాను. ఇప్పుడదే నిజమైంది. తను ఆర్మీ కెప్టెన్. అయితే మా పెళ్లి ఇప్పుడే జరగబోవడం లేదు. పరీక్షిత్ తన ఉద్యోగం రీత్యా వివిధ ప్రదేశాలకు వెళ్తుంటాడు. నేనేమో ముంబైలో ఉన్నాను. బహుశా వచ్చే ఏడాది మా వివాహం జరుగుతుంది’ అని నీతి తనకు కాబోయే భర్త వివరాలు తెలిపారు. కాగా ఇష్క్బాజ్, గులాల్ వంటి హిట్ హిందీ సీరియళ్లలో నటిస్తున్న నీతి... టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. తనీశ్ హీరోగా నటించిన ‘మేం వయసుకు వచ్చాం’, రాహుల్ రవీంద్రన్ ప్రధాన పాత్రలో నటించిన పెళ్లి పుస్తకం సినిమాలోనూ ఆమె హీరోయిన్గా నటించారు. View this post on Instagram Aithey aa❤️ @parikshitbawa #partitayles 📸- @theglamweddingofficial Outfit- @kalkifashion Jewellery - @anmoljewellers Mu- @mahima.mua A post shared by Nititay💜 (@nititaylor) on Aug 14, 2019 at 5:26am PDT -
పెళ్లి పీటలెక్కనున్న హీరోయిన్
ముంబై : బాలీవుడ్ నటి నీతి టేలర్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. తన చిరకాల స్నేహితుడు పరీక్షిత్ బవాను ఆమె వివాహమాడనున్నారు. ఇరు కుటుంబాల సమక్షంలో వీరి నిశ్చితార్థ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఇందుకు సంబంధించిన విశేషాలను నీతి సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన మెహందీ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ క్రమంలో ఆకుపచ్చ రంగు దుస్తుల్లో మెరిసిపోతున్న ఈ యువ జంటకు సన్నిహితులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఇష్క్బాజ్, గులాల్ వంటి హిట్ హిందీ సీరియళ్లలో నీతి నటిస్తున్నారు. అదే విధంగా ఆమె టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలన్న విషయం తెలిసిందే. తనీశ్ హీరోగా నటించిన ‘మేం వయసుకు వచ్చాం’, రాహుల్ రవీంద్రన్ ప్రధాన పాత్రలో నటించిన పెళ్లి పుస్తకం సినిమాలోనూ నీతి హీరోయిన్గా నటించారు. View this post on Instagram We are all a little weird and, life’s a little weird. And when we find someone whose weirdness is compatible with ours, we join up with them and fall in mutual weirdness and call it LOVE ❤️ #partitayles 🎥- @theglamweddingofficial Outfit- @kalkifashion A post shared by Nititay💜 (@nititaylor) on Aug 13, 2019 at 12:14am PDT -
పెళ్లి పుస్తకం @ 25
ప్రముఖ దర్శకుడు బాపు గీత గీసి... ముళ్లపూడి వెంకటరమణ రాత రాసి... శ్రీకారం చుట్టిన 'పెళ్లి పుస్తకం' చిత్రరాజానికి నేటికి అంటే ఏప్రిల్1వ తేదీకి 25 ఏళ్లు పూర్తయ్యాయి. 1991 ఏప్రిల్ 1న టాలీవుడ్లో విడుదలై ఈ చిత్రం ఓ చరిత్ర సృష్టించింది. హీరోహీరోయిన్లుగా నట కిరిటీ రాజేంద్ర ప్రసాద్ కృష్ణమూర్తిగా అలియాస్ కేకేగా... దివ్యవాణి సత్యభామగా ఎవరి పాత్రలో వారు ఒదిగిపోయారు. అయితే గతంలో వచ్చిన చిత్రాలు... అంటే మిస్సమ్మ (పాతది) లో ఉద్యోగం కోసం ఎన్టీఆర్, సావిత్రి భార్యాభర్తలుగా కలసి నటిస్తే... అందుకు విరుద్ధంగా పెళ్లి పుస్తకం చిత్రంలో మాత్రం రాజేంద్రప్రసాద్, దివ్యవాణి పెళ్లి చేసుకుని... ఉద్యోగం కోసం ఇద్దరు శ్రీధరరావు పాత్రలో లీనమైన గుమ్మడి వెంకటేశ్వరరావు కంపెనీలో ఆర్టిస్ట్ ఉద్యోగాన్ని కృష్ణమూర్తి.... అదే సంస్థలో పీఏ ఉద్యోగాన్ని సత్యభామా సంపాదించి ఒకరి గురించి ఒకరికి తెలియనట్లు ఆయా పాత్రలో జీవించారు. కంపెనీ యజమానిగా గుమ్మడి వెంకటేశ్వరరావు నేనూ.. అంటూ మాటమాటని కట్ చేసి వెరైటీ స్లాంగ్‌లో మాట్లాడుతుంటే... రావి కొండలరావు మాత్రం అదే సంస్థలో పని చేసే ఉద్యోగుల చేత బాబాయిగా పిలిపించుకుంటూ ... బధిర వార్తల చదువుతున్నట్లు సైగలతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. ఒకానొక సమయంలో హీరోయిన్ దివ్యవాణి చేత ఇస్త్రీ పెట్టితో వాత కూడా పెట్టించుకుంటాడు. ఇక గిరి పాత్రలో నటించిన శుభలేక సుధాకర్ విషయానికి వస్తే... గుమ్మడి బావమరిదిగా నటిస్తూ... దివ్యవాణిపై మనసు పడి... ఆ తర్వాత అక్కతో కొట్టింగు పడే సన్నివేశాలు లోలోన నవ్వు పుట్టిస్తాయి. ఇక సెకండ్ హీరోయిన్గా వచ్చిన గుమ్మడి కుమార్తె వసుంధర పాత్రలో నటించిన సింధుజా కూడా హీరో రాజేంద్రప్రసాద్ వెంట పడి... అతడి భార్య దివ్యవాణి అసూయకు కారణమవుతుంది. కానీ సింధుజాది అంతా నటన అని చివరకు తెలుసుకుంటుంది. అలాగే చిత్రంలోని బ్రహ్మచారి గదులకు భామలే అందం, పెళ్లికి పునాది నమ్మకం, గౌరవం, నవ్వొచ్చినప్పుడు ఎవడైనా నవ్వుతాడు. ఏడుపొచ్చినప్పుడు నవ్వే వాడే హీరో, అసూయ అసలైన ప్రేమకి ధర్మామీటర్, నమ్మకం లేని చోట నారాయణా అన్నా బూతులాగే వినిపిస్తూంది... లాంటి డైలాగులు ఎన్నో ప్రేక్షక దేవుళ్ల చేత చపట్లు కొట్టించాయి. పాటలు అయితే ఇక చెప్పనక్కరలేదు. ఆరుద్ర గారి చేతి నుంచి జాలు వారిన శ్రీరస్తూ...శుభమస్తూ పాట అప్పటి వరకు తెలుగు ప్రజల లోగిళ్లలో ఎక్కడ పెళ్లి బాజా భజింత్రులు మోగిన... వినిపించే సీతారాముల కళ్యాణం చూతమురారండి అంటూ సాగే పాటను పక్కకు నెట్టింది. శ్రీరస్తూ... శుభమస్తూ శ్రీకారం చుట్టుకుంది ...అంటూ సాగే పాట ఆఖరికి టీవీ సీరియళ్లలో వచ్చే పెళ్లీ సీనుల్లో ఈ వినిపిస్తూంది. మామా కె.వి. మహాదేవన్ సంగీత దర్శకత్వంలో ట్యూన్ కట్టిన అమ్మకుట్టి అమ్మ కుట్టి మనస్సు లోయో..... , కృష్ణం కలయసఖి సుందరం.... , పపపప పప పప్పు దప్పళం అన్నం నెయ్యి..., హాయి హాయి శ్రీరంగ సాయి..., సరికొత్త చీర ఊహించినాను.... పాటలు ప్రేక్షక మహాశయులనే కాదు, సంగీత ప్రియులను ఒలలాడించింది. పెళ్లికి అర్థాన్నీ, పరమార్దాన్నీ ఇంత సున్నితంగా, హృద్యంగా అందంగా ,రొమాంటిగ్గా అన్నింటినీ మించి హాస్య భరితంగా చెప్పిన చిత్రం ఈ పెళ్లి పుస్తకం. శ్రీసీతారామా బ్యానర్ పై ఈ చిత్రం రూపొందింది. -
'అమ్మ ఆశీర్వాదం కోసం వచ్చా'
విజయవాడ : భార్యాభర్తల మధ్య అనుబంధాలు, కోపతాపాలను చక్కగా తెరపై చూపిన చిత్రం 'పెళ్లిపుస్తకం' అని మా అధ్యక్షుడు, టాలీవుడ్ ప్రముఖ నటుడు జి.రాజేంద్రప్రసాద్ తెలిపారు. శుక్రవారం విజయవాడలో రాజేంద్రప్రసాద్ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల రాజేంద్రప్రసాద్ విలేకర్లతో మాట్లాడుతూ... బాపు, రమణలు చక్కగా తెరకెక్కించిన పెళ్లి పుస్తకం చిత్రం విడుదలై 25 ఏళ్లు పూర్తి చేసుకుందని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్బంగా అమ్మవారి ఆశీర్వాదం కోసం వచ్చినట్లు రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. మా తరపున సినిమా కళాకారులందరికీ ఆరోగ్య కార్డులు జారీ చేసినట్లు చిత్ర పరిశ్రమలోని వారి కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్బంగా రాజేంద్రప్రసాద్ వివరించారు. అంతకుముందు అధికారులు రాజేంద్రప్రసాద్‌కు ఆలయంలో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలను ఆలయ అధికారులు రాజేంద్రప్రసాద్‌కు అందజేశారు. -
సినీ నిర్మాత నాగిరెడ్డి దుర్మరణం
-
సినీ నిర్మాత నాగిరెడ్డి దుర్మరణం
హైదరాబాద్: నగర శివారులోని శనివారం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో పెళ్లి పుస్తకం(రాహుల్ హీరో) నిర్మాత నాగిరెడ్డి దుర్మరణం చెందారు. దర్శకుడు మదన్ తో కలిసి కారులో వెళుతుండగా ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నాగిరెడ్డి మృతిచెందగా, మదన్ కు గాయాలయ్యాయి. తొలుత తీవ్ర గాయాలైన నాగిరెడ్డిని గచ్చిబౌలిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.అయితే ఆయన అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. -
సంగీత వంశీ
కళ ఒక సంగీత దర్శకుడిగా ఎక్కువకాలం నిలబడాలంటే, సంగీతం మీద పిపాస, మంచి ట్యూన్స్ చేయాలనే ఆసక్తి, వృత్తి పట్ల నిబద్ధత, దీక్ష, కృషి, పట్టుదల ఇవన్నీ ఉండితీరాలి. వంశీకి ఇటువంటి బలమైన కోరికలు ఉంటే, ఉత్తమసంగీత దర్శకుడు అవడానికి అంతకన్నా ఇంకేం కావాలి. మ్యూజిక్... వెస్ట్రన్... రాక్... పాప్... నేటి తరానికి ఇదొక ప్యాషన్... ఇంటర్నెట్లో మ్యూజిక్ నోట్స్ డౌన్లోడ్ చేసుకుంటూ... వాద్యపరికరాలను కూడా అందులోనే తీసుకుంటూ... స్వయంగా సంగీత దర్శకత్వం చేస్తున్నారు... పట్టుమని పాతికేళ్లు కూడా నిండకుండానే సంగీత ప్రపంచంలో... చిన్నదో పెద్దదో... తమకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకుంటున్నారు. లఘుచిత్రాలతో కెరీర్ ప్రారంభించి... చలనచిత్రాల స్థాయికి ఎదుగుతున్నారు... ‘ఓ సఖీ’ ఆల్బమ్ (టాప్ టెన్‌లో ఉంది) తో 2011లో సంగీత జీవితం ప్రారంభించి, చలనచిత్రాలకు అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేసే స్థాయికి ఎదిగాడు వంశీ. ‘‘నాకు చిన్నప్పటి నుంచి కీబోర్డ్ అంటే చాలా ఇష్టం. కీబోర్డులో సరిగమల అభ్యాసానికి నాన్నగారే శ్రీకారం చుట్టారు. నాకు చదువు మీద అంతగా శ్రద్ధ లేదు. అందువల్ల చదువు మానేసి హైదరాబాద్ వచ్చాను. హిందుస్థానీ, పాశ్చాత్యం... ఈ రెండు సంప్రదాయ సంగీతాలనూ నేర్చుకున్నాను. సంగీతంతో పాటు డిజిటల్ రికార్డింగ్, మ్యూజిక్ ప్రొడక్షన్ నేర్చుకున్నాను. సంగీతం మీద ఉన్న అభిరుచి కొద్దీ, కొద్దిమంది మిత్రులతో కలసి ‘వేవ్ బ్యాండ్’ అని ఒక మ్యూజికల్ బ్యాండ్ ఏర్పాటుచేశాను’’ అంటూ వంశీ తన సంగీత ప్రయాణాన్ని వివరించారు. ‘పెళ్లి పుస్తకం’ లోని పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది’’ అంటున్న వంశీ యూ ట్యూబ్‌లో ప్రముఖుల సంగీత కచ్చేరీలు చూసి పరిజ్ఞానం పెంచుకుంటున్నారు. ఇప్పటి వరకు అనేక చలనచిత్రాలకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చేశాడు. కొన్ని చిత్రాలకు అసిస్టెంట్‌గానూ చేశాడు. ఒక పక్కన సంగీతం నేర్చుకుంటూనే మరో పక్క అతి కష్టం మీద పదవ తరగతి పూర్తి చేశాడు. ‘స్వామిరారా’, ‘ఉయ్యాలా జంపాలా’ వంటి చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేసిన సన్నీ దగ్గర అసిస్టెంట్ ఆడియో ఇంజనీర్‌గా కొన్ని నెలలు పనిచేశాక, తాను చేస్తున్న పని పట్ల అంత సంతృప్తి కలగలేదు. ‘‘కీ బోర్డు నేర్చుకోవాలనే కోరిక నానాటికీ పెరుగుతూ వచ్చింది. దాంతో ఉద్యోగం వదిలేసి, పూర్తి సమయాన్ని కీ బోర్డు నేర్చుకోవడం కోసం కేటాయించాను’’ అని చెబుతాడు వంశీ. సినిమా సంగీతానికి ఎంతో అవసరమైన పాశ్చాత్య సంప్రదాయ సంగీతం తనకు తానుగా నేర్చుకున్నారు. పెద్దపెద్ద సంగీత దర్శకుల దగ్గర కీబోర్డు ప్లేయర్‌గా పనిచేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో... ఋషి, కెమిస్ట్రీ, సరదాగా అమ్మాయితో, రొమాన్స్, నువ్వలా నేనిలా, పట్టపగలు... చలనచిత్రాలకు నేపథ్య సంగీతం అందించారు. ‘‘పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే మంచి సంగీతం చేయాలి. నా వరకు నేను మెలొడీలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నాను. సంగీతం, సాహిత్యం, ఆర్కెస్ట్రా... ఒకదాన్ని ఒకటి డామినేట్ చేయకుండా ఉండేలా చూస్తున్నాను. ఆర్కెస్ట్రా తగ్గించి, భావం అర్థమయ్యేలాగ చేస్తున్నాను’’ అని చెప్పే వంశీకి ఇళయరాజా అంటే చాలా ఇష్టం. పరోక్షంగా ఆయన ప్రభావం తన మీద ఉందనీ, త్వరలోనే తనకు ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చేలాంటి పాటలు చేస్తానని అంటున్నారు. సంగీతం చేస్తున్నప్పుడు అందరితోనూ స్నేహంగా ఉంటూ తనకు కావలసిన విధంగా వాళ్ల దగ్గర నుంచి రాబట్టుకుంటున్నారు. ఎంఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద వచ్చిన జనగణమన, పెళ్లి పుస్తకం, ప్రేమపకోడీ, హూ ఆర్ దే? పొసెసివ్‌నెస్, మధురమే, చిట్టితల్లి... లఘుచిత్రాలకు సంగీతం చేశారు వంశీ. ‘‘పెళ్లిపుస్తకం’ పాటకు 2.5 లక్షల హిట్స్ వచ్చాయి. నాకు మంచి పేరు కూడా వచ్చింది’’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తపరిచారు వంశీ. - డా. వైజయంతి