దగ్గుబాటి వారసుడు రానా పెళ్లి బాజాలు మోగించనున్నాడనగానే బ్యాచిలర్స్ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లైంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కాస్తా పెళ్లి రూటు వైపు వెళ్లిపోతున్నాడేంటని ఎందరో బ్యాచిలర్స్ గుండెలు మండిపోయాయి. ఈ విషయం కాసేపు పక్కన పెడితే తాను ప్రేమించిన అమ్మాయి మిహికా బజాజ్‌ను మనువాడే ఘడియల కోసం రానా పడిగాపులు కాస్తున్నాడు. ఇప్పటికే ఈ ప్రేమజంటను వివాహ బంధంతో ఒక్కటి చేసేందుకు ఆగస్టు 8న ముహూర్తం నిశ్చయించినట్లు ఇరువైపుల కుటుంబాలు ఇదివరకే ప్రకటించాయి. (ప్లాన్ ఎ... ప్లాన్ బి... ప్లాన్ సి!)
ఇందుకోసం ఇరు కుటుంబ సభ్యులు ఇప్పటినుంచే పెళ్లి ఏర్పాట్లలో బిజీ అయిపోయారు కూడా! అయితే రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో పెళ్లి వాయిదా వేసే అవకాశాలున్నాయంటూ కొన్ని వార్తలు వెలువడ్డాయి. రానా-మిహికాల పెళ్లి ఆగస్టులో జరగడం లేదని ఇవి పేర్కొన్నాయి. ఈ పుకార్లపై స్పందించిన వధూవరుల కుటుంబ సభ్యులు వాటిని అసత్య ప్రచారాలుగా కొట్టివేశారు. గతంలో చెప్పిన తారీఖుకే పెళ్లి జరిగి తీరుతుందని స్పష్టం చేశారు. కరోనా మరింత భయపెట్టినా, లాక్‌డౌన్ మరోసారి పొడిగించినా, ఇంకే విపత్తు వచ్చినా రానా పెళ్లి మాత్రం జరిగే తీరుతుందంటున్నారు. (ఇదే.. నాకు సంతోషాన్నిచ్చేది: మిహీకా బజాజ్)
Comments
Please login to add a commentAdd a comment