వివాదాలకతీతంగా 'రావణ దేశం' తెరకెక్కించా: అజయ్ | Nothing controversial in 'Ravana Desam': Ajay Nuthakki | Sakshi
Sakshi News home page

వివాదాలకతీతంగా 'రావణ దేశం' తెరకెక్కించా: అజయ్

Published Tue, Nov 12 2013 12:52 PM | Last Updated on Sat, Sep 2 2017 12:33 AM

Nothing controversial in 'Ravana Desam': Ajay Nuthakki

శ్రీలంకలో జరిగిన అంతర్యుద్దంలో తప్పిపోయిన శరణార్థుల కథాంశంతో 'రావణ దేశం' తెరకెక్కించినట్లు ఆ చిత్ర దర్శకుడు అజయ్ నూతక్కి వెల్లడించారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఆ చిత్రంలో ఎటువంటి వివాదస్పద అంశాలు లేవని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం చెన్నైలో అజయ్ విలేకర్లతో మాట్లాడుతూ... తెలుగు, తమిళలకు అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ ఆ చిత్రం రూపొందించలేదన్నారు.

 

2009లో శ్రీలంకలో జరిగిన అంతర్యుద్దంలోని కొన్ని వాస్తవ సంఘటనల స్పూర్తిగా తీసుకుని  ఆ చిత్రాన్ని నిర్మించినట్లు చెప్పారు. శుక్రవారం విడుదల కానున్న ఆ చిత్రం చూసిన ప్రేక్షకుడు మాత్రం ఆనాటి సంఘటనలకు ఎవరో ఒకరు బాధ్యులని భావిస్తాడని ఆయన అభిప్రాపయపడ్డారు. ఆ చిత్రం తెరకెక్కించే క్రమంలో ఆచూకీ తెలియకుండా పోయిన శరణార్థుల అంశంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్లు చెప్పారు.

 

అయితే ఆ అంతర్యుద్ధం ముందు ఆ తర్వాత ప్రజల జీవన స్థితిగతులను వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఆ చిత్రంలోని దృశ్యాలను చిత్రీకరించినట్లు తెలిపారు. రావణ దేశం చిత్రంలో జన్నీఫర్, రమేష్లు  నాయికనాయుకులుగా నటించారు. న్యూ అంఫైర్ సెల్యూలాయిడ్ సంస్థ ఆ చిత్రాన్ని నిర్మించింది.

Advertisement
Advertisement