ట్రాన్సిస్టర్ ధరించి.. అనుష్క వచ్చేసింది!! | now, anushka sharma poses with a transistor for pk | Sakshi
Sakshi News home page

ట్రాన్సిస్టర్ ధరించి.. అనుష్క వచ్చేసింది!!

Published Fri, Oct 17 2014 2:34 PM | Last Updated on Sat, Sep 2 2017 3:00 PM

ట్రాన్సిస్టర్ ధరించి.. అనుష్క వచ్చేసింది!!

ట్రాన్సిస్టర్ ధరించి.. అనుష్క వచ్చేసింది!!

అచ్చం అమీర్ఖాన్ లాగే ట్రాన్సిస్టర్ ధరించి వచ్చేస్తున్నానంటూ ట్విట్టర్లో హడావుడి చేసిన అనుష్కా శర్మ.. అన్నట్లు గానే ఓ ట్రాన్సిస్టర్ పట్టుకుని వచ్చింది. అయితే, తనకు సరిపోయేదాని కంటే చాలా ఎక్కువ సైజులో ఉన్న పోలీసు యూనిఫాం వేసుకుని, ట్రాన్సిస్టర్ తగిలించుకుని వచ్చింది. పి.కె. చిత్రం మోషన్ పోస్టర్ను యూట్యూబ్లో విడుదల చేశారు. ఈ సినిమాలో అమీర్ఖాన్, అనుష్కాశర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అనుష్క వచ్చేసిందంటూ అమీర్ఖాన్ ముందుగా ట్వీట్ చేసి, అందులో యూట్యూబ్ వీడియో లింక్ ఇచ్చాడు. ''ఏ దేఖా.. హమార్ జగ్గు.. ట్రాన్జిస్టర్ కే సాథ్.." అని అందులో అమీర్ అన్నాడు. సినిమాలో అనుష్కాశర్మ పాత్ర పేరు జగత్ జనిని.

ఆ తర్వాత మళ్లీ అనుష్క మరో ట్వీట్ ఇచ్చింది. 'గందరగోళం పడ్డారా? నేను పి.కె. కాను. నా పేరు జగత్ జనిని. అవును జగత్ జనిని' అని చెప్పింది. ఆ తర్వాత మోషన్ పోస్టర్లో ఇద్దరూ జైల్లో ఉన్నట్లు, సైకిల్ మీద ఉన్నవి.. ఇలా పలు ఫొటోలు ఇచ్చారు. ఇంతకీ ఈ సినిమాలో అమీర్ పాత్ర ఏంటో, అనుష్క పాత్ర ఏంటో తెలియదు గానీ, ట్రాన్సిస్టర్కు మాత్రం ప్రధాన పాత్ర ఉందని అర్థమైపోతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement