హాటెస్ట్ వెజిటేరియన్లు వీళ్లే! | Aamir, Anushka crowned PETA hottest vegetarians | Sakshi
Sakshi News home page

హాటెస్ట్ వెజిటేరియన్లు వీళ్లే!

Dec 29 2015 12:42 PM | Updated on Sep 3 2017 2:46 PM

హాటెస్ట్ వెజిటేరియన్లు వీళ్లే!

హాటెస్ట్ వెజిటేరియన్లు వీళ్లే!

బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్ ఖాన్, హీరోయిన్ అనుష్కా శర్మ.. వీళ్లిద్దరినీ 2015 సంవత్సరానికి గాను హాటెస్ట్ వెజిటేరియన్లగా పెటా ఎంపిక చేసింది.

బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్ ఖాన్, హీరోయిన్ అనుష్కా శర్మ.. వీళ్లిద్దరినీ 2015 సంవత్సరానికి గాను హాటెస్ట్ వెజిటేరియన్లగా పెటా ఎంపిక చేసింది. అమితాబ్ బచ్చన్, ఆలియా భట్, కంగనా రనౌత్, షాహిద్ కపూర్, ఆర్. మాధవన్, ధనుష్.. ఇలా ఎంతోమంది ఈ టైటిల్ కోసం పోటీపడినా, వాళ్లందరినీ తోసిరాజని ఆమిర్, అనుష్క గెలుచుకున్నారు. పెటాఇండియా.కామ్ వెబ్‌సైట్ చూసేవాళ్లందరినీ తమకు బాగా నచ్చిన వెజిటేరియన్లకు ఓట్లు వేయాల్సిందిగా కోరారు. తాను పూర్తి 'వెగన్'గా మారుతున్నట్లు ఆమిర్ ఇటీవలే ప్రకటించాడు. అంటే పాలు, పాల ఉత్పత్తులు, కోడిగుడ్లు, తేనె, తోలు, ఫర్, పట్టు, ఊలు, కాస్మొటిక్స్, పశు ఉత్పత్తుల నుంచి తయారుచేసిన సోపులు కూడా వాడరన్నమాట. వెగన్స్ అంటే నాన్ వెజిటేరియన్లు, వెజిటేరియన్ల కంటే కూడా ఎక్కువని తాను కన్విన్స్ అయినట్లు ఆమిర్ చెప్పాడు.

అలాగే.. మనం ఏం తింటున్నామన్నది చాలా ముఖ్యమని, తగినన్ని కాయగూరలు తినడం, తగినంత నీళ్లు తాగడం అవసరమని, తాను ఎప్పుడూ అలాగే చేస్తానని అనుష్కాశర్మ ఈ సందర్భంగా ఓ ప్రకటనలో తెలిపింది. ఆమిర్.. అనుష్క.. వీళ్లిద్దరూ వెజిటేరియన్లకు సరైన ఉదాహరణ అని పెటా ఇండియా మేనేజర్ సచిన్ బంగెరా అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement