
ఎన్టీఆర్ తిరిగొచ్చాడు
చాలా రోజులుగా తన నెక్ట్స్ సినిమా షూటింగ్ కోసం విదేశాల్లో గడుపుతున్న ఎన్టీఆర్ ఇండియాకు తిరిగొచ్చాడు. సుకుమార్ డైరెక్షన్లో 'నాన్నకు ప్రేమతో' టైటిల్తో సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమా కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా 80 రోజుల పాటు విదేశాల్లో షూటింగ్ చేశారు. లండన్ లోని థేమ్స్ నది ఒడ్డున ఉన్న ఓ కాస్ట్లీ ఇంట్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.
హైదరాబాద్ చేరుకున్న జూనియర్ శ్రీమంతుడు స్పెషల్ షో చూశాడు. లాంగ్ షూటింగ్ షెడ్యూల్ తరువాత కొద్ది రోజులు గ్యాప్ తీసుకుంటున్న ఎన్టీఆర్ అక్టోబర్ రెండో వారంలో బ్యాలెన్స్ షూటింగ్కు రెడీ అవుతున్నాడు. సెకండ్ షెడ్యూల్ను కూడా స్పెయిన్లో ప్లాన్ చేస్తున్న యూనిట్ ఈ షెడ్యూల్తో షూటింగ్ దాదాపుగా పూర్తి చేయాలని భావిస్తున్నారు.
టెంపర్ హిట్తో సక్సెస్ ట్రాక్లోకి వచ్చిన ఎన్టీఆర్ రికార్డ్లు తిరగరాసే భారీ హిట్ను టార్గెట్ చేస్తుంటే, వన్ ఫెయిల్యూర్తో ఇబ్బందుల్లో ఉన్న సుకుమార్ ఓ బిగ్ హిట్ తో తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు. అందుకే నాన్నకు ప్రేమతో సక్సెస్ ఇద్దరి కెరీర్కు కీలకం కానుంది.