
ఎన్టీఆర్
కాలేజ్‌లో స్టూడెంట్‌గా అల్లరి చేయడానికి సిద్ధమయ్యారు ఎన్టీఆర్. యాక్షన్ నుంచి ఎంటర్‌టైన్‌మెంట్ ట్రాక్ ఎక్కారు. త్రివిక్రమ్ పంచ్‌లను చిత్తూరు యాసలో పేల్చనున్నారాయన. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా యస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. పూజా హెగ్డే కథానాయిక. ఈ చిత్రం కొత్త షెడ్యూల్‌ను నిన్న స్టార్ట్ చేశారు. ఈ షెడ్యూల్‌లో కాలేజ్ బ్యాక్‌డ్రాప్ సన్నివేశాలను చిత్రీకరిస్తారట. ఇందులో ఎన్టీఆర్, పూజా హెగ్డే పాల్గొంటారు.
ఆగస్ట్ మూడు వరకు జరిగే ఈ షెడ్యూల్‌లో యాక్షన్ సీన్స్ కాకుండా ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్ మీద దృష్టి పెట్టనున్నారట దర్శకుడు త్రివిక్రమ్. ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయని సమాచారం. ఈ షెడ్యూల్ తర్వాత కొన్ని సాంగ్స్ కోసం చిత్రబృందం పొల్లాచ్చి వెళ్లనుంది. ఈ చిత్రంలో జగపతిబాబు, నాగబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆగస్ట్ 15న ‘అరవింద సమేత..’ టీజర్‌ను విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 10న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment