అనగనగనగా... ఫారిన్‌లో పాటంట | ntr aravinda sametha veera raghava pree release date fix | Sakshi
Sakshi News home page

అనగనగనగా... ఫారిన్‌లో పాటంట

Published Sun, Sep 23 2018 1:19 AM | Last Updated on Thu, Aug 22 2019 9:35 AM

ntr aravinda sametha veera raghava pree release date fix - Sakshi

మొన్నా మధ్య ఆలయంలో పూజాలు చేశారు వీర రాఘవ. ఆ తర్వాత ప్రేయసితో కలిసి రైల్వేస్టేషన్‌కి వెళ్లారు. ఆ నెక్ట్స్‌ రాయలసీమలో విలన్స్‌పై వీరవిహారం చేశారు. ఇప్పుడు పాట కోసం ఫారిన్‌ వెళ్లారు. ఎన్టీఆర్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘అరవింద సమేత వీరరాఘవ’. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పైన చెప్పిందంతా ఈ సినిమా గురించే. టాకీ పార్ట్‌ దాదాపు పూర్తయింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ కూడా మరింత ఊపందుకున్నాయి. ఈ సినిమాలోని ఓ పాటను చిత్రీకరించడం కోసం స్విస్‌–ఇటాలియన్‌ బోర్డర్‌ వెళ్లారు టీమ్‌.

ఆల్రెడీ ఈ సినిమాలోని నాలుగు పాటలు విడుదలై శ్రోతలను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. మరి.. ఏ సాంగ్‌ కోసం వీర రాఘవ అండ్‌ కో ఫారిన్‌ వెళ్లారు? అని ఆలోచించే పనిలో పడ్డారు ఫ్యాన్స్‌. కొందరైతే ‘అనగనగనగా’ అనే సాంగ్‌ అని ఊహిస్తున్నారు. ఈ సాంగ్‌ షూట్‌ ఈ రోజు నుంచి స్టార్ట్‌ అవుతుందట. నిజానికి విదేశాల్లో రెండు పాటల చిత్రీకరణను ప్లాన్‌ చేశారని వార్తలు వచ్చాయి. కానీ ఫైనల్‌గా ఒకటి ఫిక్స్‌ అయ్యిందన్న మాట. ఈ చిత్రానికి తమన్‌ స్వరకర్త. ఈ సినిమా ప్రీ–రిలీజ్‌ వేడుక అక్టోబర్‌ ఫస్ట్‌ వీక్‌లో జరగనుందని టాక్‌. నాగబాబు, జగపతిబాబు కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాను అక్టోబర్‌ 11న విడుదల చేయాలనుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement