స్వర్ణమా.. రజతమా అన్నది ముఖ్యం కాదు!
ఒలింపిక్స్ లో రజతం సాధించిన తొలి మహిళా ప్లేయర్ గా నిలిచిన పీవీ సింధుకు అభినందనల వెల్లువ మొదలైంది. కోట్లాది భారతీయుల ఆకాంక్షను నెరవేర్చేందుకు పోరాడిన భారత షట్లర్ పీవీ సింధుకు టాలీవుడ్ యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ అభినందనలు తెలిపాడు. గంటకు పైగా హోరాహోరీగా సాగిన పోరులో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకర్ కరోలినా మారిన్ 21-19, 12-21, 15-21 తేడాతో భారత సంచలనం సింధుపై నెగ్గిన విషయం తెలిసిందే. సింధు గెలిచించి స్వర్ణమా.. రజతమా, లేక కాంస్య పతకమా అన్నది ముఖ్యం కాదని, ఫైనల్లో ఆమె పోరాట పటిమను మెచ్చుకుంటూ ట్వీట్ చేశాడు. ఫైనల్లో చాంపియన్ తరహా ఆటతీరును సింధు ప్రదర్శించారని భారత్కు పతకాన్ని అందించిన స్టార్ షట్లర్ను కొనియాడాడు.
Bronze silver or gold doesn't matter.what matters is the true fighting spirit.And you fought like a champion.congrats @Pvsindhu1
— tarakaram n (@tarak9999) 19 August 2016