గౌను జారి...
Published Thu, Feb 6 2014 12:14 AM | Last Updated on Sat, Sep 2 2017 3:22 AM
వెండితెరపై గ్లామరస్ దుస్తుల్లో కనిపించే అందాల తారలు బయట కూడా అందమైన దుస్తుల్లో కనిపించి, కనువిందు చేస్తారు. ‘ఫ్యాషన్’ పేరుతో రకరకాల డ్రెస్సులు డిజైన్ చేయించుకుంటుంటారు. కొన్ని డ్రెస్సులు చూస్తే, అసలవి ఎలా ధరించాలో కూడా ఊహకందదు. ఇక, ఈ ఫ్యాషన్ డ్రెస్సులు తారలకు ఎంత ప్లస్ అవుతాయో... అంతే మైనస్ అవుతాయి. పలు సందర్భాల్లో ఆ డ్రెస్ తాలూకు బటన్ ఊడిపోవడమో, లేస్ తెగిపోవడమో, ఒక్కొక్కసారైతే ఎక్కడ చిరిగితే అభాసుపాలవుతారో అక్కడే చిరుగుతుంటాయి.
ఇటీవల ప్రియాంక చోప్రా అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. మోకాళ్లు దాటిన ఎరుపు, నలుపు, తెలుపు చారలు గల గౌను వేసుకొని ఓ వేడుకలో పాల్గొన్నారామె. ఛాతీకి కొంచెం పై వరకు ఆ గౌను ఉంటుంది. అదే తంటా అయ్యింది. సపోర్ట్‌గా బొందులేవీ లేకపోవడంతో గౌను జారే ప్రమాదం కనిపించిందట. అది జరగనే జరిగింది. గౌను జారడం, గబుక్కున లాక్కోవడం.. ఇదే తంతు అయ్యిందట. ఈ అనుభవంతో ప్రియాంక చోప్రా ఇక దుస్తుల విషయంలో జాగ్రత్తపడతారని ఊహించవచ్చు.
Advertisement
Advertisement