అతణ్ణి చూశాక ఆ అభిప్రాయం మార్చుకున్నా! | opinion changed after watching him | Sakshi
Sakshi News home page

అతణ్ణి చూశాక ఆ అభిప్రాయం మార్చుకున్నా!

Published Tue, Sep 29 2015 12:03 AM | Last Updated on Sun, Sep 3 2017 10:08 AM

అతణ్ణి చూశాక  ఆ అభిప్రాయం  మార్చుకున్నా!

అతణ్ణి చూశాక ఆ అభిప్రాయం మార్చుకున్నా!

చాలా ముద్దుగా ఉంటుంది రాశీ ఖన్నా.   అందరితో నవ్వుతూ మాట్లాడుతుంది. ముఖ్యంగా ఆమె నవ్వు ఎవ్వరినైనా మెస్మరైజ్ చేస్తుంది. ఆమెకు చాలా ఓపిక ఎక్కువ. కెరీర్‌లో స్టెప్ బై స్టెప్ ఎదగాలనుకుంటోంది.  ‘ఊహలు గుసగుసలాడె’, ‘జిల్’ సినిమాలతో తెలుగు తెరపై మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయిందీ ఢిల్లీ బ్యూటీ. అక్టోబర్ 2న విడుదల కానున్న ‘శివమ్’లో రామ్‌తో  పోటాపోటీగా నటించానని చెబుతున్నారామె. రాశీ ఖన్నా చెప్పిన కొన్ని ముచ్చట్లు...
 

 దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి ‘శివమ్’ కథ చెప్పగానే నన్ను ఉద్వేగానికి గురి చేసిన రెండు విషయాలు ఏంటంటే... స్టోరీ, నా క్యారెక్టర్. ఇందులో నా పాత్ర పేరు ‘తను’. ఆ అమ్మాయి చాలా ఇగోయిస్ట్. రియల్ లైఫ్‌లో నాకు లేనిది అదే. సో.. నేను కానిది చేయడం నాకు కొత్తగా అనిపించింది. తను ఇగోయిస్ట్ మాత్రమే కాదు.. ఎమోషనల్ పర్సన్ కూడా. సో.. ఇగో, ఎమోషన్, కోపం... ఇలా చాలా కోణాలు ఆవిష్కరించే వీలు కుదిరింది. నటిగా నాకు సవాల్ అనిపించింది.

 ఇందులో రామ్, నా కాంబినేషన్‌లో ‘టామ్ అండ్ జెర్రీ’ తరహా సీన్స్ ఉన్నాయి. అవి చాలా ఫన్నీగా ఉంటాయి. రామ్ చాలా ఎనర్జిటిక్. యాక్చువల్‌గా నేనే చాలా హార్డ్ వర్కర్ అనే అభిప్రాయం ఉండేది. కానీ, రామ్‌ని చూశాక ఆ అభిప్రాయాన్ని మార్చేసుకున్నాను. రామ్ డ్యాన్స్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిందే. ఇలా నేర్చుకుని అలా చేసేసేవాడు. నాకేమో అంత సులువుగా వచ్చేది కాదు. అందుకని ఎక్కువసేపు రిహార్శల్స్ చేసేదాన్ని. రామ్ చాలా ఓపికగా వెయిట్ చేసేవాడు. చాలా కో-ఆపరేటివ్.

 నేను దాదాపు కొత్త దర్శకులతోనే సినిమాలు చేస్తున్నాను. ఈ చిత్రదర్శకుడికి ఇది మొదటి సినిమానే. చాలా క్లారిటీగా, కంఫర్ట్‌గా తీశారాయన. ‘స్రవంతి’ మూవీస్‌లో సినిమా చేయడం ఓ మంచి ఎక్స్‌పీరియన్స్. రవికిశోర్‌గారు చాలా డిగ్నిఫైడ్ ప్రొడ్యూసర్. నాకైతే ఒక ఫ్యామిలీతో కలిసి సినిమా చేసిన అనుభూతిని ‘శివమ్’ మిగిల్చింది.

 నార్వే, స్వీడెన్‌లలో కొన్ని ప్రమాదకర లొకేషన్స్‌లో పాటలు చేశాం. నాకేం భయం అనిపించలేదు. ఎందుకంటే, మరీ లైఫ్ రిస్క్ అనే టైప్ లొకేషప్స్ కావవి. ఈ చిత్రంలో నా కాస్ట్యూమ్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. ముఖ్యంగా ఒక పాటలో ‘సిగార్’ డ్రెస్ ఉంటుంది. సిగరెట్ లుక్ వచ్చేట్లు ఆ డ్రెస్ డిజైన్ ఉంటుంది. ఓవరాల్‌గా చాలా స్టయిలిష్‌గా కనిపిస్తాను. ఈ సినిమా పరంగా నేను మర్చిపోలేని విషయాలు చాలా ఉన్నాయి. వాటిలో క్లయిమ్యాక్స్ ఒకటి. యాక్షన్, కామెడీ మిక్స్‌తో ఉంటుంది. కెమెరా ముందు ఆ సన్నివేశాలు చేస్తున్నప్పుడు మాత్రమే కాదు.. వెనక కూడా బాగా నవ్వేదాన్ని. ‘ఎవరైనా లాఫింగ్ గ్యాస్ ఇచ్చారేమో’ అని లొకేషన్లో జోక్ చేసేవాళ్లు.  ప్రస్తుతం ‘బెంగాల్ టైగర్’లో రవితేజ సరసన, సాయిధరమ్‌తో ‘సుప్రీమ్’ చిత్రాలు చేస్తున్నాను. వీటిలో కూడా నావి మంచి పాత్రలే. నాకు డ్రీమ్ రోల్స్ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు. నటిగా సవాల్ అనిపించే ప్రతి పాత్రా నాకు డ్రీమ్ రోల్ వంటిదే.
 
 
 నాకు పెద్ద దర్శకులతో సినిమాలు చేయాలని ఉంది. ఎవరు అవకాశం ఇచ్చినా కాదనను. తెలుగు పరిశ్రమలో నా స్థానం ఏంటి? అనే విషయం గురించి పెద్దగా ఆలోచించడంలేదు. మంచి అవకాశాలు వస్తున్నాయి. అన్నింటినీ సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను. పోటీ గురించి కూడా పట్టించుకోవడంలేదు.  ప్రతిభతో పాటు అదృష్టం కూడా కలిసి రావాలంటారు. ఆ విషయాన్ని నేను నమ్ముతాను. నేను యాక్ట్ చేస్తున్న సినిమాలు సక్సెస్ అవ్వడంతో పాటు నాక్కూడా మంచి పేరొస్తోంది. సో.. నా హార్డ్ వర్క్‌కి లక్ తోడైందని నమ్ముతున్నాను.
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement