
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రంగస్థలం 1985. పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు టైటిల్ లోగోను మాత్రమే రిలీజ్ చేసిన చిత్రయూనిట్, దసరా సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.
తాజాగా ఈ ఫస్ట్ లుక్ రిలీజ్ కు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. గతంలో చెర్రీ హీరోగా తెరకెక్కిన నాయక్ సినిమా ఆడియో ఫంక్షన్ లో పాల్గొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తరువాత చరణ్ సినిమాలకు సంబంధించిన ఏ వేడుకలోనూ పాలు పంచుకోలేదు. ఇన్నాళ్లకు రంగస్థలం 1985 ఫస్ట్ లుక్ ను పవన్ చేతుల మీదుగా రిలీజ్ చేయనున్నారట. ఇప్పటి వరకు అధికారిక ప్రకటన లేకపోయినా.. పవన్, చరణ్ ల మధ్య ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా పవన్, రంగస్థలం ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.