పవన్ మానియా మొదలైంది అప్పట్నుంచే | Pawan Kalyan Mania Started then only | Sakshi
Sakshi News home page

పవన్ మానియా మొదలైంది అప్పట్నుంచే

Published Mon, Sep 2 2013 1:24 AM | Last Updated on Sat, Jul 6 2019 3:48 PM

పవన్ మానియా మొదలైంది అప్పట్నుంచే - Sakshi

పవన్ మానియా మొదలైంది అప్పట్నుంచే

స్టార్ అయిన ప్రతి ఒక్కరూ ఎదుటివారిని ప్రభావితం చేయలేరు. అది అతి కొద్దిమందికే సాధ్యం. ఆ కొద్దిమందిలో కచ్చితంగా పవన్‌కల్యాణ్ ఒకరు. ప్రస్తుత యువతరానికి  పవనిజాన్ని  అనుసరించడం పరిపాటైపోయింది. దశాబ్దంన్నర క్రితం విడుదలైన ‘తొలిప్రేమ’ నుంచే యువతలో ఈ పవన్ మానియా మొదలైంది. 
 
 పవన్ క్రేజ్ జయాపజయాలకు అతీతం. తన అన్న చిరంజీవి వదిలి వెళ్లిన అగ్ర స్థానానికి అతి చేరువలో ఉన్న కథానాయకుడాయన. అందుకు ఆయన సినిమాల ఓపెనింగ్సే నిదర్శనం. అంతేకాదు.. మెగా హీరోలకు సంబంధించిన ఏ వేడుక జరిగినా... ఆ వేడుకలో పవన్ ఉన్నా, లేకున్నా.. అభిమానుల నుంచి ముక్తకంఠంతో వినిపించే పదం ఒక్కటే ‘పవర్‌స్టార్’. కుర్రకారుని ఆ స్థాయిలో మెస్మరైజ్ చేశారాయన. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా కోసం ప్రస్తుతం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. 
 
 అలాగే... మరోమారు ‘గబ్బర్‌సింగ్’లా పవన్ ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.  ఈ చిత్రం కోసం దర్శకుడు సంపత్‌నంది అద్భుతమైన కథ తయారు చేశారని సమాచారం. ఈ రెండు సినిమాలతో అభిమానులను ఓ రేంజ్‌లో ‘ఖుషీ’ చేయనున్నారు పవర్‌స్టార్. నేడు ఆయన పుట్టిన రోజు. నేడంతా ఫ్యాన్స్‌కి పండగే పండగ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement