సైరా సినిమాకు పవన్‌ వాయిస్‌ ఓవర్‌ | Pawan Kalyan's Voice Over To Chiranjeevi Sye Raa Narasimha Reddy | Sakshi
Sakshi News home page

సైరా సినిమాకు పవన్‌ వాయిస్‌ ఓవర్‌

Published Fri, Aug 16 2019 10:04 AM | Last Updated on Fri, Aug 16 2019 4:26 PM

Pawan Kalyan's Voice Over To Chiranjeevi Sye Raa Narasimha Reddy - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భారీ చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. చిరుతనయుడు రామ్‌ చరణ్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా కావటంతో సినిమా మీద అంచనాలు పెంచేందుకు చిత్రయూనిట్ అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. తాజాగా ఈ సినిమాకు పవన్‌ కల్యాణ్‌ వాయిస్‌ఓవర్‌ అందించిన ఫోటోలను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. స్వయంగా చిరు, దర్శకుడు సురేందర్‌ రెడ్డి దగ్గరుండి పవన్‌తో డబ్బింగ్ చెప్పించారు.

చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్‌, కన్నడ స్టార్ సుధీర్‌, తమిళ స్టార్‌ విజయ్‌ సేతుపతి, జగపతి బాబు, తమన్నా, రవికిషన్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ సంగీత దర్శకుడ అమిత్‌ త్రివేది సంగీతమందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement