ప్రియాంక ఎగ్జిట్‌కు కారణం ఇదే.. | Pay Cheque The Reason Behind Priyankas Exit From Bharat | Sakshi
Sakshi News home page

ప్రియాంక ఎగ్జిట్‌కు కారణం ఇదే..

Published Tue, Jul 31 2018 8:24 AM | Last Updated on Tue, Jul 31 2018 10:37 AM

Pay Cheque The Reason Behind Priyankas Exit From Bharat - Sakshi

న్యూఢిల్లీ : గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగిన ప్రియాంక చోప్రా బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ మూవీ భారత్‌ నుంచి అర్థంతరంగా నిష్క్రమించడం వెనుక నిక్‌ జొనాస్‌తో ఆమె వివాహం కారణమనే ప్రచారం సాగింది. అయితే ప్రియాంక ఆ ప్రాజెక్టు నుంచి వైదొలగడానికి నిక్‌తో పెళ్లి ప్రతిపాదనలకు ఎలాంటి సంబంధం లేదని సమాచారం. ప్రియాంక పక్కా ప్రొఫెషనల్‌ అని, గతంలో 2013లో ఆమె తండ్రి మరణించిన సమయంలోనూ షూటింగ్‌ను రద్దు చేసుకోకుండా యథావిథిగా పాల్గొన్నారని ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి.

నిక్‌తో ఎంగేజ్‌మెంట్‌ కారణంగా ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నుంచి ఆమె తప్పుకున్నారనడం సరైంది కాదని చెబుతున్నాయి. మరోవైపు ఈ సినిమాకు పీసీ రూ 14 కోట్లు డిమాండ్‌ చేయగా, చిత్ర మేకర్లు కేవలం రూ 6.5 కోట్లు ఇవ్వచూపడం ఆమెకు రుచించలేదని తెలిసింది. పే చెక్‌తో పాటు అదనంగా మరికొందరు ఆర్టిస్టులను మూవీలో అనూహ్యంగా తెరపైకి తేవడాన్ని కూడా ప్రియాంక చోప్రా వ్యతిరేకించినట్టు చెబుతున్నారు. దీంతో మూవీ నుంచి తప్పుకోవాలని ప్రియాంక నిర్ణయించుకోవడంతో తాజాగా ఆమె స్ధానంలో కత్రినా కైఫ్‌ను హీరోయిన్‌గా చిత్ర బృందం ఎంపిక చేసింది. 2019 ఈద్‌కు విడుదల కానున్న ఈ మూవీలో దిషా పటానీ, సునీల్‌ గ్రోవర్‌, నోరా ఫతేహి, టబు తదితరులు ప్రధాన తారాగణంగా ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement