సల్మాన్‌ అప్‌సెట్‌ అవలేదు.. | Salim Khan Says Salman Iis Not Upset With Priyanka For Quitting Bharat | Sakshi
Sakshi News home page

సల్మాన్‌ అప్‌సెట్‌ అవలేదు..

Published Sun, Jul 29 2018 5:24 PM | Last Updated on Sun, Jul 29 2018 5:24 PM

Salim Khan Says Salman Iis Not Upset With Priyanka For Quitting Bharat - Sakshi

సాక్షి, ముంబై : బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ మూవీ భారత్‌ నుంచి గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా అనూహ్యంగా తప్పుకోవడంపై సల్లూ భాయ్‌ ఆగ్రహంగా ఉన్నట్టు ప్రచారం సాగింది. అమెరికన్‌ సింగర్‌ నిక్‌ జోనాస్‌తో వివాహ ప్రయత్నాల నేపథ్యంలో పీసీ ఈ మూవీ నుంచి అర్థంతరంగా నిష్ర్కమించారని స్వయంగా దర్శకుడు అలీ అబ్బాస్‌ స్పష్టం చేశారు. ఏమైనా ప్రియాంక నిర్ణయంతో సల్మాన్‌ కోపంగా ఉన్నారని, ఆమెతో కలిసి ఇక ఏ మూవీలో నటించరాదని నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. 

ప్రియాంక నిర్ణయంపై సల్మాన్‌ అప్‌సెట్‌ కాలేదని ఆయన తండ్రి సలీం ఖాన్‌ పేర్కొన్నారు. పరిశ్రమలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని, డేట్స్‌, డబ్బు ఇతర కారణాల వల్ల ఏమైనా జరగొచ్చని, ప్రియాంక స్ధానంలో మరో హీరోయిన్‌ను తీసుకుంటారని ఆయన చెప్పుకొచ్చారు. ప్రియాంక నిర్ణయంతో తాము గానీ, సల్మాన్‌ గానీ అప్‌సెట్‌ అవలేదని స్పష్టం చేశారు. కాగా ఈ మూవీలో ప్రియాంక స్థానంలో కత్రినా కైఫ్‌ను హీరోయిన్‌గా చిత్ర యూనిట్‌ ఎంపిక చేసిందని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement