'కత్తి' కష్టాలు, నటుడు విజయ్ ఇంటికి భద్రత | Police Protection in Actor Vijay's House | Sakshi
Sakshi News home page

'కత్తి' కష్టాలు, నటుడు విజయ్ ఇంటికి భద్రత

Published Mon, Aug 11 2014 9:53 AM | Last Updated on Wed, Apr 3 2019 8:57 PM

'కత్తి' కష్టాలు, నటుడు విజయ్ ఇంటికి భద్రత - Sakshi

'కత్తి' కష్టాలు, నటుడు విజయ్ ఇంటికి భద్రత

చెన్నై : నటుడు విజయ్ ఇంటిని తమిళ సంఘాలు ముట్టడించనున్నట్లు సమాచారంతో ఆయన నివాసానికి పోలీసులు భద్రత కల్పించారు. విజయ్  తాజాగా 'కత్తి'  అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. కత్తి చిత్రాన్ని శ్రీలంక తమిళుడు నిర్మిస్తున్నట్లు, అతడు నిర్మిస్తున్న చిత్రంలో విజయ్ నటించడమా? అన్న చర్చ బయలుదేరింది. దీనిపై కొన్ని తమిళ సంఘాలు వ్యతిరేకత తెలిపాయి.

ఈ వివాదంపై తమిళ సంఘాలతో దర్శకుడు ఏఆర్ మురుగదాస్ చర్చలు కూడా జరిపారు. అయితే కత్తి చిత్రంలో విజయ్ నటించకూడదని ఈ సందర్భంగా తమిళ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే విజయ్ ఇంటిని ముట్టడించనున్నట్లు సమాచారంతో ముందు జాగ్రత్త చర్యగా అతని నివాసం ముందు సుమారు 50మందికి పైగా పోలీసులు మోహరించారు.

కత్తి చిత్రాన్ని లైకా సంస్థ నిర్మిస్తోందన్నారు. ఈ సంస్థ యజమాన్యానికి, శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేకు సన్నిహిత సంబంధాలున్నాయని కొన్ని తమిళ సంఘాలు ఆరోపిస్తున్నాయి. కాగా గతంలోనూ విజయ్ నటించిన 'తలైవా' చిత్రాన్ని కూడా కొన్ని తమిళ సంఘాల వ్యతిరేకించిన విషయం తెలిసిందే. కత్తి చిత్రంలో విజయ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement