పూజ జాతకం మారుతుందా..? | Pooja Hegde to Become Another Golden Leg from Hairsh Shankar | Sakshi
Sakshi News home page

పూజ జాతకం మారుతుందా..?

Published Tue, Jun 13 2017 10:58 AM | Last Updated on Tue, Sep 5 2017 1:31 PM

Pooja Hegde to Become Another Golden Leg from Hairsh Shankar

ముకుంద, ఒక లైలా కోసం, మొహెంజోదారో సినిమాలతో ఆకట్టుకున్న పూజ హెగ్డే హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నా సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. తెలుగుతో పాటు తమిళ హిందీ భాషల్లో నటించిన పూజ సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకోలేకపోయింది. అందుకే ఒక్క కమర్షియల్ హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తోంది.  అలాంటి సమయంలో అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో సరసన డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో పూజకు ఛాన్స్ ఇచ్చాడు దర్శకుడు హరీష్ శంకర్.

గతంలో వరుస ఫ్లాప్లతో ఐరన్ లెగ్ ముద్ర వేయించుకున్న శృతిహాసన్ను గబ్బర్సింగ్ సినిమాకు హీరోయిన్గా తీసుకొని అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే ఈ సినిమాతో శృతి జాతకమే మారిపోయింది. గబ్బర్సింగ్ సక్సెస్తో అప్పటి వరకు ఐరన్ లెగ్ హీరోయిన్ అనిపించుకున్న శృతి హాసన్ ఒక్క సారిగా లక్కీ హీరోయిన్గా మారిపోయింది. ఇప్పుడు పూజ హెగ్డే విషయంలోనూ అలాంటి మ్యాజిక్కే జరుగుతుందని ఆశిస్తున్నారు. మరి శృతి తరహాలో పూజ కూడా దూసుకుపోతుందేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement