
ప్రస్తుతం టాలీవుడ్ పూజా హెగ్డే హవా నడుస్తోంది. టాలీవుడ్ టాప్ హీరోలందరూ పూజతో కలిసి నటించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. కెరీర్‌లో ఒక్క బిగ్ హిట్ లేకపోయినా పూజా హెగ్డే ఇమేజ్ మాత్రం తారా స్థాయికి చేరింది. ప్రస్తుతం ఈ భామ ఎన్టీఆర్ సరనస హీరోయిన్‌గా నటించిన ‘అరవింద సమేత’ ఇప్పటికే రిలీజ్ కాగా, మహేష్ సరసన నటించిన ‘మహర్షి’ ఈ నెల 9న రిలీజ్ కానుంది. ప్రభాస్‌కు జోడిగా నటిస్తున్న సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది.
తాజాగా మహర్షి ప్రమోషన్ సందర్భంగా టాప్ స్టార్స్‌తో కలిసి నటించటంపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు పూజా హెగ్డే. అరవింద సమేత, మహర్షి, ప్రభాస్ సినిమాలు ఒకేసారి షూటింగ్ జరగటంతో పూజా..ఒకే రోజు ముగ్గురు హీరోలతో కలిసి నటించాల్సి వచ్చిందట.
ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు ఎన్టీఆర్‌తో అరవింద సమేత, తరువాత మధ్యాహ్నం 2 గంటల నుంచి 7 గంటల వరకు మహేష్ మహర్షి, రాత్రి 9 గంటల నుంచి 2 గంటల వరకు ప్రభాస్ సినిమాల షూటింగ్‌లో పాల్గొన్నారట. ఈ షెడ్యూల్స్ సమయంలో రోజుకు కేవలం నాలుగు గంటల మాత్రమే నిద్రపోయేందుకు సమయం దొరికేదట. కాస్త కష్టమనిపించినా ఒకేసారి ముగ్గురు టాప్ హీరోలతో కలిసి నటించటం ఆనందంగా ఉందన్నారు పూజ.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు, పూజా హెగ్డే హీరోయిన్లు గా నటించిన మహర్షి ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. అల్లరి నరేష్ మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. ఈమూవీ మహేష్ 25వ సినిమా కావటంతో ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment