విజయ్ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి | Post mortem to Actor vijay dead body at Osmania Hospital | Sakshi
Sakshi News home page

విజయ్ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి

Published Tue, Dec 12 2017 11:16 AM | Last Updated on Wed, Apr 3 2019 8:57 PM

Post mortem to Actor vijay dead body at Osmania Hospital - Sakshi

సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్ నటుడు కాలే విజయ్ సాయి(40) మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యులు పోస్ట్‌మార్టం పూర్తి చేశారు. నేటి సాయంత్రం విజయ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల యూసుఫ్‌ గూడలోని సొంత ఫ్లాట్‌లో విజయ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. కాగా, ఆత్మహత్యకు ముందు నాలుగు నిమిషాల నిడివి సెల్ఫీ వీడియోలో విజయ్‌ మాట్లాడుతూ.. భార్య వనితతో పాటు ముగ్గురిపై ఆరోపణలు చేశారు. ఈ ఉదంతానికి సంబంధించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే భార్య వనిత కూడా తీవ్రస్థాయిలో విజయ్‌పై ఆరోపణలు చేయడంతో అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. 

'తన చావుకు భార్య వనితతో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త శశిధర్‌(నవయుగ సంస్థ), అడ్వొకేట్‌ శ్రీనివాస్‌ కారణం. వనిత తనకు వాల్‌పోస్టర్‌ సినిమా షూటింగ్‌లో పరిచయమైందని, పెళ్ళైన తర్వాతే ఆమె నిజస్వరూపం తెలిసింది. నా కుమార్తె కుందన(7)ను మీరు పెంచాలి. నా భార్య వద్ద పెరగకూడదు. ఐ లయ్ యూ డాడీ.. ఎవరినీ వదిలిపెట్టొద్దు.. అందరికీ శిక్ష పడేలా చేయండి డాడీ' అంటూ సెల్ఫీ వీడియోలో విజయ్ తన అవేదనను వ్యక్తం చేశారు. కాగా, ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో విజయ్‌ ధరించిన వస్త్రాలు, వీడియోలో ఉన్న వాటిని పోల్చిన పోలీసులు.. చనిపోవడానికి కొద్దిసేపటి ముందే దాన్ని చిత్రీకరించినట్లు గుర్తించారు. దీన్ని విశ్లేషణ నిమిత్తం ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీకి పంపారు. నటుడు విజయ్ అమ్మాయిలు అబ్బాయిలు, ఒకరికి ఒకరు, మంగళ, వరప్రసాద్‌ పొట్టిప్రసాద్, బొమ్మరిల్లు తదితర సినిమాల్లో నటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement