టైటిల్ : ప్రేమెంత పనిచేసే నారాయణ
నటీనటులు: హరికృష్ణ, అక్షిత, ఝాన్సీ, గంగారావు, రాహుల్ బొకాడియా తదితరులు
దర్శకత్వం: జొన్నల గడ్డ శ్రీనివాసరావు
నిర్మాత: సావిత్రి జొన్నలగడ్డ
సంగీతం: యాజమాన్య
దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు తనయుడు హరికృష్ణ కథానాయకుడిగా ` ప్రేమెంత పనిచేసే నారాయణ` పరిచయం అవుతున్నారు. రిలీజ్ కు ముందు సినిమా టీజర్, ట్రైలర్ మంచి బజ్ ను క్రియేట్ చేసాయి. మ్యూజికల్ గా హిట్ అవ్వడంతో విషయం ఉన్న సినిమా అని అంచనాలు మరింత పెరిగాయి. దీనికి తోడు రిలీజ్ విషయంలో అల్లు అరవింద్ కూడా తోడవ్వటం హాట్ టాపిక్ అయింది. మరి ఆ అంచనాలను సినిమా అందుకుందా? లేదా? అన్నది ఓ సారి చూద్దాం..
కథ:
హరికృష్ణ( హరి) ఓ అనాధ. బతకు పోరాటంలో హరికి మరో మగ్గురు స్నేహితులు తోడవుతారు. ముగ్గురు ఓ పెద్దాయన (బాబాయ్) వద్ద పనికి కుదురుతారు. హరి తొలి చూపులోనే శిరీష(అక్షిత)ను ప్రేమిస్తాడు. ప్రేమ కోసం వెంటపడి చివరికి శిరీష ప్రేమను పొందుతాడు. శిరీష తల్లి ఓ పెద్దింట్లో పనిమనిషి. ఆమె గయ్యాలి. ప్రేమగీమా అంటే జాన్తా నయ్ అనే టైపు. అమె కో తమ్ముడు. అతని రూపంలో హరి ప్రేమకు అడ్డంకులు ఏర్పడతాయి. వాటన్నింటినీ జయించే క్రమంలో మేయర్ రాజేశ్వరీ (జాన్సీ) నుంచి ప్రేమ జంటకు ప్రాణాపాయం ఏర్పడుతుంది. మరి ఆ ప్రమాదానికి అసలు కారణం ఎవరు? హరి ప్రేమించిన అమ్మాయిని దక్కిచుకోవడం కోసం ఎలాంటి సాహసాలు చేసాడు? అందుకు హరి స్నేహితులు ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారు.. అన్నది తెరపైనే చూడాలి.
నటీనటులు:
హీరో హరికృష్ణ కు డెబ్యూ మూవీ అయినప్పటికీ..ఆ ఫియర్ ఎక్కడా కనిపించలేదు. రెండు, మూడు సినిమాలు చేసిన అనుభవం ఉన్న నటుడిలా ఎక్స్ ప్రెషన్స్ అన్నింటిని బాగా క్యారీ చేసాడు. యాక్టింగ్ లో మంచి ఈజ్ ఉంది. కెమెరా ఫియర్ కనిపించలేదు. ఇక డాన్సులైతే ఇరగదీసాడు. అతని ఎనర్జీకి తగ్గ పాటలు కుదరడంతో ట్యాలెంట్ మొత్తం చూపించాడు. మంచి కథలు పడితే ప్యూచర్ లో పెద్ద స్టార్ అవుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. హీరోయిన్ అక్షిత కూడా ఇప్పుడిప్పుడే టాలీవుడ్ ఎదుగుతోంది. ఆమె కెరీర్ కి ఈ సినిమా ప్లస్ అవుతుంది. నటనకు ఆస్కారం ఉన్న పుల్ లెంగ్త్ రోల్ లో నటించింది. హీరో స్నేహితుల పాత్రలు బాగున్నాయి. మేయర్ పాత్రలో ఝాన్సీ నటన బాగుంది. మిగతా పాత్రలు కూడా కథకు తగ్గట్టు చక్కగా కుదిరాయి.
విశ్లేషణ:
ప‌్రేమ కథలను ఒక్కో దర్శకుడు ఒక్కో స్టైల్లో చెబుతాడు. డైరెక్టర్ ఎవరైనా.. ప్రేమలో ఘాడతను బట్టే సినిమా హిట్టు ఫట్టు అన్నది డిసైడ్ అవుతుంది. అమ్మాయి-అబ్బాయి మధ్య ప్రేమ పుట్టడానికి కారణాలేవి ఉండవు. ఎక్కడైనా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నదే కాన్సెప్ట్. అయితే ఆ కథను ఆసక్తికరంగా మలచడమే దర్శకుడి పనితనానికి సవాల్. ఆ విషయంలో దర్శకుడు జొన్నలగడ్డ నూటికి నూరుశాతం సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. హీరో, హీరోయిన్ వెంట పడే సన్నివేశాలు రొటీన్ గా ఉన్నప్పటికీ యవతను ఆకట్టుకుంటాయి. నలుగురు స్నేహితుల మధ్య కామెడీని పండించే అవకాశం ఉన్నా.. దర్శకుడు ఆ ఛాన్స్ తీసుకోకుండా ప్రేమకు సంబంధించిన సన్నివేశాలనే నమ్ముకున్నాడు. ద్వితియార్థంలో కథను మరింత రక్తి కట్టించాడు.
ప్రేమను దక్కించుకోవడం కోసం హీరో పడే పాట్లు మొదలవుతాయి. ప్రేమికురాలి ప్రాణమా? ప‌్రేమ కావాలా? అన్న సన్నివేశం ఎదురైనప్పుడు హీరో నలిగిపోయే సన్నివేశం బాగుంది. స్నేహితుల పాత్రలకు దర్శకుడు అంతే వెయిట్ ఇచ్చాడు. ప్రారంభం నుంచి చివరి వరకూ ఆ పాత్రలకు హీరోతో పాటు సమాన భారాన్ని మోసారు. హీరోయిన్ తల్లి పాత్ర అగ్రెసివ్గా ఉంటుంది. కథలో ఎక్కడా అసభ్య కర సన్నివేశాలు, అడల్ట్ కంటెంట్ ఎక్కడా ఉండదు. క్లైమాక్స్ లో ఆ మధ్య సంచలనం రేపిన మిర్యాల గూడ ఘటనను ఉద్దేశించినట్లు అనిపిస్తుంది.
ప్రేమకు కులం లేదు. మతం లేదు. ప్రాంతం లేదు. ప్రేమ మిస్టరీ కాకూడదు. అది ఓ చరిత్ర అవ్వాలిని హీరో చెప్పే డైలాగులు బాగున్నాయి. ప్రేమించడానికి అమ్మాయి ఉంటే సరిపోదు. ఆ ప్రేమను పొందాలంటే మంచి స్నేహితులు కూడా అవసరమని సినిమా చెప్పింది. ప్రేమలో భావోద్వేగాలను తెరపై చక్కగా ఆవిష్కరించారు. ఓవరాల్గా ఈ సినిమా ప్రేమికులను మెప్పించే అవకాశం ఉంది. మేకింగ్ పరంగా సినిమా బాగుంది. స్ర్కీన్ ప్లే కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ, కొరియోగ్రపీ అన్ని చక్కగా కుదిరాయి. వనమాలి, గోసల రాంబాబు సాహిత్యం బాగుంది. యాజమాన్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
హీరో హీరోయిన్ల నటన
సంగీతం
మైనస్ పాయింట్స్ :
రొటీన్ కథ
Comments
Please login to add a commentAdd a comment