నిక్ జోనస్, ప్రియాంకా చోప్రా
గత కొన్ని రోజులుగా తమ మధ్య ఏదో ఉంది అంటూ ఊరిస్తూ వచ్చిన నిక్ జోనస్, ప్రియాంకా చోప్రా ఫైనల్‌గా రింగ్స్ మార్చుకున్నారు. ముంబైలో రోకా ఫంక్షన్‌తో అధికారికంగా మేమిద్దరం ఒక్కటౌతున్నాం అని చెప్పేశారు. బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా, హాలీవుడ్ పాప్ సింగర్ నిక్ జోనస్ కొన్ని రోజులుగా ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. ప్రియాంక కన్నా నిక్ పదేళ్లు చిన్న. ప్రియాంకకు 35 ఏళ్లు. వయసు వ్యత్యాసం ప్రేమకు అడ్డు కాదు. నిక్‌తో వివాహం కోసమే సల్మాన్ ఖాన్ ‘భారత్’ సినిమా నుంచి ప్రియాంక తప్పుకున్న సంగతి తెలిసిందే.
శనివారం ముంబైలో రోకా ఫంక్షన్ జరిగింది. రోకా అంటే.. ‘మా ఇద్దరికీ పెళ్లి సమ్మతమే’ అని, ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్టు అని అర్థం. ఈ వేడుకలో ఇరు కుటుంబ సభ్యులు కలుసుకొని స్వీట్స్ పంచుకుంటారు. నిక్ కుటుంబం, ప్రియాంక కుటుంబ సభ్యులతో పాటు కొందరు బాలీవుడ్ నటీనటులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ‘నా హార్ట్, సోల్‌తో కలిసి దిగిన ఫొటో’ అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రియాంక పోస్ట్ చేశారు. దానికి నిక్ ‘కంగ్రాచ్యులేషన్స్. అతను మోస్ట్ లక్కీయస్ట్ పర్సన్ అనుకుంటున్నాను’ అని కామెంట్ చేశారు. పెళ్లి వచ్చే ఏడాది జరగనుందట.
Comments
Please login to add a commentAdd a comment