ముదురు భామలతోనే డేటింగ్‌ ఎందుకంటే.. | Priyanka Chopras Beau Nick Jonas Reveals Why He Likes Older Women | Sakshi
Sakshi News home page

ముదురు భామలతోనే డేటింగ్‌ ఎందుకంటే..

Published Tue, Jul 17 2018 6:01 PM | Last Updated on Tue, Jul 17 2018 6:43 PM

Priyanka Chopras Beau Nick Jonas Reveals Why He Likes Older Women - Sakshi

న్యూయార్క్‌ : అమెరికన్‌ సింగర్‌ నిక్‌ జొనాస్‌, గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు జోరుగా సాగుతున్న క్రమంలో ఓ ఇంటర్వ్యూలో నిక్‌ జొనాస్‌ వెల్లడించిన అంశాలు ఆసక్తికరంగా మారాయి. ప్రియాంక చోప్రా (35) కంటే వయసులో పది సంవత్సరాలు చిన్న అయిన నిక్‌ గతంలోనూ తన కంటే బాగా పెద్దవయసు వారితో సన్నిహితంగా మెలిగాడు. తనకంటే 13 ఏళ్లు పెద్దయిన కేట్‌ హడ్సన్‌, 8 ఏళ్లు పెద్దయిన డెల్టా గోడ్రెమ్‌తోనూ నిక్‌ డేటింగ్‌లో ఉన్నాడు.

అయితే ముదురు భామలతోనే డేటింగ్‌కు ఎందుకు ఇష్టపడతాడో నిక్‌ వెల్లడించిన వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. ఆండీ కోహెన్‌ షోలో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు నిక్‌ నవ్వుతూ బదులిస్తూ వయసుపై తాను ఎలాంటి పరిమితి విధించుకోలేదని..తన కంటే వయసులో పెద్దవారు వారేం కోరుకుంటారో వారికి తెలుస్తుందని చెప్పాడు. తాను డేటింగ్‌లో ఉన్నవారిలో అధిక వయసు 35 సంవత్సరాలని పరోక్షంగా ప్రియాంకను ఉద్దేశించి పేర్కొన్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement