అమ్మాయి కత్తి పడితే!
అందమైన అమ్మాయి చేతులు రక్తంతో తడిశాయి. తనకు అన్యాయం చేసిన వాళ్ల అంతు తేల్చింది. మరి ఎందుకో కారణం తెలియాలంటే ‘క్రిమినల్స్’ చూడాల్సిందే అంటున్నారు దర్శకుడు ఓషో తులసీరామ్. ప్రియాంక కొఠారి ఇందులో ముఖ్య పాత్రధారిణి. మంత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పి.శ్రీనివాసరావు, సి.హెచ్.వి. శర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను దర్శకుడు విజయ్‌కుమార్ కొండా ఆవిష్కరించారు. ఓషో తులసీరామ్ మాట్లాడుతూ -‘‘ప్రియాంక కొఠారి తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో వెలిగొండ శ్రీనివాస్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కార్తీక్, ప్రియాంక కొఠారి తదితరులు పాల్గొన్నారు.