ఇప్పుడు ఆ గోలంతా ఎందుకు?
మాజీ ప్రియుడు తన జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీస్తుంటే ఎవరైనా కంగారు పడతారు. కానీ పిగ్గీ చాప్స్ గా పేరొందిన పేరొందిన క్రిష్ హీరోయిన్ ప్రియాంకా చొప్రా దీన్ని లైట్ గా తీసుకుంది. ఇప్పటికే లేడీ బాక్సర్ మేరీకామ్ జీవితంపై తీస్తున్న సినిమాలో మేరీకామ్ పాత్ర పోషిస్తున్న ప్రియాంక ఇప్పుడు తన పాత్రను తానే పోషించబోతోందన్న మాట. సినిమాని తీస్తోంది ఆమె మోడలింగ్ చేస్తున్నప్పటి పాత ప్రియుడు అసీమ్ మర్చెంట్.
అయితే ఆమెకు ఈ సినిమా విషయంలో కొన్ని అభ్యంతరాలు కూడా ఉన్నాయి. ప్రియాంక లైఫ్ తో ఆమె మేనేజర్ ప్రకాశ్ రాజ్ తో వచ్చిన గొడవ ఒక చీకటి అధ్యాయం. అప్పట్లో ఆమె చాలా కష్టాలు పడింది. చివరికి కోర్టు కేసుల దాకా వెళ్లింది. మేనేజర్ రెండు నెలలు జైలు శిక్ష కూడా అనుభవించాడు.
'అసలా గోలంతా ఎందుకు? ఆ సంఘటన నాకెంత వేదన కలిగించిందో నాకే తెలుసు. అవన్నీ ఇప్పుడెందుకు? ఇప్పుడు ఆ బరదను కెలకాల్సిన అవసరం ఉందా' అని ప్రియాంక ఆబ్జెక్షన్లు లేవనెత్తుతున్నారట.