
సాక్షి, హైదరాబాద్: బిగ్‌బాస్ హౌజ్‌లో సింగర్ రాహుల్‌తో తనకు ఉన్న అనుబంధంపై నటి పునర్నవి భూపాలం మరోసారి స్పందించారు. ఇటీవల ఓ ఆంగ్ల దినపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె.. తామిద్దరం ప్రేమలో ఉన్నామంటూ వస్తున్న రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చారు. ‘ బిగ్‌బాస్ హౌజ్‌లో రాహుల్ నా బెస్ట్ ఫ్రెండ్. నేను అతనితో ఎక్కువగా గొడవపడి ఉండాల్సింది కాదు. అందుకు బాధపడుతున్నా’ అని తెలిపారు. ‘మాది ప్యూర్, స్ట్రాంగ్ ఫ్రెండ్‌షిప్. కానీ, మొదట్లో కొన్ని వారాలు నేను రాహుల్‌తో అంత కంఫర్ట్‌బుల్‌గా లేను. అందుకే అతన్ని తిట్టేదానిని. నాకు దూరంగా ఉండమని చెప్పేదాన్ని. బయట ప్రపంచం మా ఫ్రెండ్‌షిప్‌ను ఎలా చూస్తుందోనని వర్రీ అయ్యేదానిని. కానీ, దాని గురించి పెద్దగా పట్టించుకోకూడదని తర్వాత అర్థం చేసుకున్నా. ఆ తర్వాత మేం మరింత క్లోజ్ అయ్యాం’ అని పునర్నవి పేర్కొన్నారు.
బిగ్‌బాస్ హౌస్‌లో లేడీ మోనార్క్‌గా పేరు తెచ్చుకున్న పునర్నవి గత వారం ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆమె బయటకు రాగానే తన టీమ్ పీవీవీఆర్ (పునర్నవి, వరుణ్, వితిక, రాహుల్) ఫ్యాన్స్ అందరూ వరుణ్, రాహుల్‌కు ఓట్లు వేయాలని ప్రచారం చేపట్టారు. రాహుల్, తాను క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమేనని, ఎంత కొట్టుకున్నా, తిట్టుకున్నా తాము మంచి మిత్రులని చెప్పారు. రాహుల్ టాప్ 5లో ఉండాలని తన కోరికను బయటపెట్టారు. ఇక, పునర్నవి కంటే రెండు వారాల ముందే ఎలిమినేట్ అయిన హిమజ.. తాజాగా పునర్నవి ఎలిమినేట్ కావడంతో ఎగిరిగంతేశారు. పునర్నవి ఎలిమినేట్ అయిందని నాగార్జున ప్రకటించగానే హిమజ టీవీ ముందుకు వచ్చి స్టెప్పులేశారు. ఈ మేరకు ఓ వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment