పవర్‌ ఆఫ్‌ యూత్‌! | Puneet Rajkumar's next titled 'Yuvarathna' | Sakshi
Sakshi News home page

పవర్‌ ఆఫ్‌ యూత్‌!

Published Fri, Jan 25 2019 3:26 AM | Last Updated on Fri, Jan 25 2019 3:26 AM

Puneet Rajkumar's next titled 'Yuvarathna'  - Sakshi

పునీత్‌ రాజ్‌కుమార్‌

కాలేజీ స్టూడెంట్స్‌ లవర్స్‌ డేని ప్రత్యేకంగా చూస్తారు. అందుకే తన తర్వాతి చిత్రం ‘యువరత్న’ను ఆ రోజే ఆరంభించాలని డిసైడ్‌ అయ్యారు కన్నడ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌. ఎందుకంటే ఆయన దాదాపు పదిహేనేళ్ల తర్వాత ఈ సినిమాలో స్టూడెంట్‌ పాత్రలో కనిపించబోతున్నారట పునీత్‌. ఈ సినిమాకు ‘పవర్‌ ఆఫ్‌ యూత్‌’ అనే ట్యాగ్‌లైన్‌ పెట్టారు. హీరోయిన్‌ పాత్ర కోసం ప్రముఖ సౌత్‌ ఇండియన్‌ హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తున్నారట టీమ్‌. ప్రస్తుతం పునీత్‌ నటించిన ‘నటసార్వభౌమ’ చిత్రం రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ రోజు ఉదయం ఈ సినిమా ట్రైలర్‌ విడుదల అవుతుంది. అనుపమా పరమేశ్వరన్‌ కథానాయికగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement