'టెంపర్'కు నో చెప్పిన నారాయణమూర్తి! | R NarayanaMurthy turned down JrNTR | Sakshi
Sakshi News home page

'టెంపర్'కు నో చెప్పిన నారాయణమూర్తి!

Published Tue, Jan 20 2015 5:31 PM | Last Updated on Sat, Sep 2 2017 7:59 PM

'టెంపర్'కు నో చెప్పిన నారాయణమూర్తి!

'టెంపర్'కు నో చెప్పిన నారాయణమూర్తి!

జూనియర్ ఎన్టీఆర్ తో నటించేందుకు 'విప్లవనాయకుడు' ఆర్. నారాయణమూర్తి నిరాకరించారని టాలీవుడ్ సమాచారం. మొదట్లో ఎన్టీఆర్ తో నటించేందుకు ఆసక్తి చూపించిన ఆయన తర్వాత ఈ ఆఫర్ ను వదులుకున్నారు. నారాయణమూర్తిని ఎంతో అభిమానించే దర్శకుడు పూరీ జగన్నాథ్ తన తాజా చిత్రం 'టెంపర్'లో ఆయన కోసం ప్రత్యేక పాత్ర తయారు చేశారు. ఎన్టీఆర్ కు అపోజిట్ గా ఉండే ఈ పాత్రలో నారాయణమూర్తిని నటింపజేయాలని భావించారు.

అయితే 'టెంపర్' లో కీలక పాత్ర కోసం నారాయణమూర్తిని సంప్రదించిన మాట వాస్తమేనని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పారితోషికం గురించి ప్రస్తావించలేదని కూడా తెలిపాయి. చివరకు తమ ఆఫర్ ను ఆయన తిరస్కరించారని పేర్కొన్నాయి. 'ఎర్ర' సినిమాల్లో తప్పా మిగతా సినిమాల్లో నటించరని నారాయణమూర్తి మరోసారి రుజువు చేశారని టాలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు. కాగా, పూరి జగన్నాథ్ 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమాను ఆర్ నారాయణమూర్తికి అంకితమిచ్చిన సంగతి గుర్తుండేవుంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement