త‍్వరలో నా రాణిని పరిచయం చేస్తా! : హీరో | Raj Tarun Announces Marriage Plans | Sakshi
Sakshi News home page

త‍్వరలో నా రాణిని పరిచయం చేస్తా! : హీరో

Published Wed, May 29 2019 9:53 AM | Last Updated on Wed, May 29 2019 9:53 AM

Raj Tarun Announces Marriage Plans - Sakshi

ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో తరువాత ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేకపోయాడు. సినిమా చూపిస్తా మామ, కుమారి 21ఎఫ్ లాంటి సినిమాలు సక్సెస్‌ అయినా  స్టార్ ఇమేజ్‌ మాత్రం అందుకోలేకపోయాడు.

ప్రస్తుతం ఈ యంగ్ హీరో దిల్ రాజు నిర్మిస్తున్న ఇద్దరి లోకం ఒకటే సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన రాజ్‌ తరుణ్‌ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. తాను లవ్‌ మ్యారేజ్‌ చేసుకుంటానని చెప్పిన రాజ్‌ తరుణ్‌, త్వరలోనే తాను పెళ్లి చేసుకోబోయే రాణిని పరిచయం చేస్తానన్నాడు.


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement