ఆటోవాలా ప్రేమలో పడితే!
ఓ ఆటో డ్రైవర్, ఇంజనీరింగ్ చదువుకునే అమ్మాయి లవ్‌లో పడ్డారు. తర్వాత వాళ్ల జీవితం ఎలాంటి మలుపులు తీసుకుందనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘ప్రేమంటే సులువు కాదురా’. రాజీవ్, సిమ్మిదాస్ జంటగా చందా గోవింద్ రెడ్డి దర్శకత్వంలో భవనాసి రాంప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. నిర్మాత మాట్లాడుతూ- ‘ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకూ దర్శకుడు అందంగా తీర్చిదిద్దారు .
చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటూ అన్ని వర్గాల వారినీ ఆక ట్టుకునే చిత్రమిది. త్వరలోనే పాటలను విడుదల చేయనున్నాం’అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: నందన్‌రాజ్, సహ నిర్మాతలు: సుధాకర్ రెడ్డి, శ్రీపతి శ్రీరాములు.