బేరానికి దిగలేరు..భయపెట్టి బతకలేరు! | Rajeshekhar as police officer in Psv. Garudaega 126.18 M movie | Sakshi
Sakshi News home page

బేరానికి దిగలేరు..భయపెట్టి బతకలేరు!

Published Mon, May 22 2017 12:09 AM | Last Updated on Tue, Sep 5 2017 11:40 AM

బేరానికి దిగలేరు..భయపెట్టి బతకలేరు!

బేరానికి దిగలేరు..భయపెట్టి బతకలేరు!

పోలీస్‌ పాత్రలంటే యాంగ్రీ మేన్‌ రాజశేఖరే గుర్తుకొస్తారు. ఆ పాత్రల్లో అంతలా ఒదిగిపోతారాయన. ఆయన మరోసారి  పోలీసాఫీసర్‌గా నటిస్తున్న చిత్రం ‘పి.ఎస్‌.వి. గరుడవేగ 126.18ఎం’. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో జ్యోస్టార్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సమర్పణలో కోటేశ్వరరాజు నిర్మిస్తున్నారు. పూజా కుమార్‌ కథానాయిక.

‘కబాలి, చీకటి రాజ్యం’ చిత్రాల్లో విలన్‌ పాత్రల్లో మెప్పించిన కిషోర్‌ ఈ చిత్రంలో పవర్‌ఫుల్‌ విలన్‌ జార్జ్‌ పాత్ర చేస్తున్నారు. ‘‘జార్జ్‌.. రాక్షసుడి మానవ రూపం.. అతనితో పొత్తే వినాశనం.. శారీరకంగా అవిటివాడైనా, మానసికంగా అత్యంత బలవంతుడు. బుద్ధి బలంతో ఢీ కొట్టి గెలవలేం. అతనితో బేరానికి దిగలేరు, భయపెట్టి బతకలేరు.. వేటకు దిగిన మృగం కంటే క్రూరుడు.. జార్జ్‌ పాత్ర గొప్ప ప్రతినాయకులైన మొగాంబో, గబ్బర్‌సింగ్‌ని తలపిస్తుంది’’ అని దర్శక–నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: అంజి, సంగీతం: శ్రీచరణ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement