'కబాలి' వచ్చేస్తున్నాడు.. రిలీజ్‌ తేదీ ఖరారు! | Rajinikanth Kabali all set to release in June | Sakshi
Sakshi News home page

'కబాలి' వచ్చేస్తున్నాడు.. రిలీజ్‌ తేదీ ఖరారు!

Published Thu, Apr 21 2016 3:45 PM | Last Updated on Sun, Sep 3 2017 10:26 PM

'కబాలి' వచ్చేస్తున్నాడు.. రిలీజ్‌ తేదీ ఖరారు!

'కబాలి' వచ్చేస్తున్నాడు.. రిలీజ్‌ తేదీ ఖరారు!

భారీ అంచనాలతో హైలీ అవెయిటెడ్ ప్రాజెక్టుగా వస్తున్న రజనీకాంత్‌ 'కబాలి' సినిమా విడుదల తేదీ ఖరారైంది. జూన్‌ 3న ఈ సినిమాను విడుదల చేయాలని నిర్మాత కలైపులి ఎస్ థాను నిశ్చయించినట్టు తెలుస్తోంది. సూపర్‌ స్టార్ రజనీ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. శంకర్‌ సెన్సేషనల్ ప్రాజెక్టు '2.o'(రోబో-2)లో నటించేందుకు ప్రస్తుతం కాస్తా విరామం తీసుకున్న ఆయన మళ్లీ 'కబాలి' టీమ్‌తో జాయిన్‌ అయ్యాడు. చెన్నైలోని ప్రఖ్యాత ప్రివ్యూ థియేటర్‌ లే మ్యాజిక్‌ లాంతర్న్‌లో సోమవారం నుంచి ఆయన 'కబాలి'కి డబ్బింగ్ చెప్తున్నారు. 'సినిమా పోస్ట్ ప్రోడక్షన్‌ పనులన్నీ పూర్తయ్యే దశకు వచ్చాయి. జాతీయ అవార్డు గ్రహీత ప్రవీణ్‌ కేఎల్‌ ఎడిటింగ్ వర్క్‌ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. దర్శకుడు పా రంజీత్ పర్యవేక్షణలో స్పెషల్ ఎఫెక్ట్స్‌, ఎడిటింగ్‌ పనులు చకచకా జరిగిపోతున్నాయి' అని చిత్ర యూనిట్‌ సన్నిహిత వర్గాలు తెలిపాయి.

మే 1న ఒక నిమిషం నిడివి గల 'కబాలి' టీజర్‌ను విడుదల చేయనున్నారు. 'కబాలి'కి పోటీగా అన్నట్టు వస్తున్న సూర్య '24' సినిమా టీజర్‌ను మే 6న విడుదల కానుంది. ఇక 'కబాలి' ఆడియోను మలేషియాలో ఆవిష్కరించేందుకు నిర్మాత కలైపులి ఎస్ థాను ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమా షూటింగ్ అధికశాతం మలేషియాలో సాగడంతో అక్కడే ఆడియో విడుదల చేయాలని భావిస్తున్నారు. గతంలో రజనీకాంత్‌ 'రోబో' సినిమా ఆడియోను మలేషియాలో విడుదల చేయగా.. అది సక్సెస్ ఫుల్ అయిన సంగతి తెలిసిందే.

వయస్సు మళ్లిన మాజీ గ్యాంగ్‌ స్టర్‌గా రజనీ నటిస్తున్న 'కబాలి' సినిమా కథ అండర్‌ వరల్డ్ మాఫియా చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో రాధికా ఆప్టే, ధన్సికా, కలైరాజన్‌, దినేశ్, నాజర్ తదితరులు నటిస్తున్నారు. సంతోష్‌ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement