నిరాడంబరంగా రజనీ పెళ్లి రోజు | Rajinikanth, wife Latha celebrate 35th wedding anniversary | Sakshi
Sakshi News home page

నిరాడంబరంగా రజనీ పెళ్లి రోజు

Published Sat, Feb 27 2016 2:14 AM | Last Updated on Wed, Apr 3 2019 9:02 PM

నిరాడంబరంగా రజనీ పెళ్లి రోజు - Sakshi

నిరాడంబరంగా రజనీ పెళ్లి రోజు

టీనగర్: నటుడు రజనీకాంత్ తన ముప్పై ఐదవ పెళ్లి రోజును శుక్రవారం నిరాడంబరంగా కుటుంబ సభ్యులతో జరుపుకున్నారు. కుమార్తెలు, ఐశ్వర్యా ధనుష్, సౌందర్య అశ్విన్ ఇరువురూ తమ భర్తలతోపాటు రజనీకాంత్ పాదాలకు నమస్కరించి ఆశీస్సులు పొందారు. నటుడు రజనీకాంత్ ,లత వివాహం 1981లో తిరుపతిలో జరిగింది. శుక్రవారం పోయెస్ గార్డెన్‌లోగల తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి రజనీకాంత్ పెళ్లి రోజును నిరాడంబరంగా జరుపుకున్నారు. కుమార్తెలు ఐశ్వర్యా ధనుష్, సౌందర్యా అశ్విన్, అల్లుళ్లు నటుడు ధనుష్, అశ్విన్ రాంకుమార్ రజనీకాంత్- లత కాళ్లకు నమస్కరించి ఆశీస్సులందుకున్నారు. ప్రత్యేకంగా తెప్పించిన కేక్‌ను రజనీకాంత్ కట్ చేశారు.

మనవళ్లు లింగా, యాత్ర ఇరువురు కేక్‌ను తాత రజనీకాంత్‌కు తినిపించారు. ముందుగా రజనీకాంత్‌ను చూసేందుకు ఆయన ఇంటి ముందు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. రజనీకాంత్ పెళ్లి రోజు సందర్భంగా రాజకీయ ప్రముఖులు, చిత్రరంగ ప్రముఖులు ఫోన్ల ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement