
రజనీకాంత్ బీజేపీలోకి వస్తే బాగుంటుంది: కృష్ణంరాజు
రాజకీయాల పట్ల రజనీకాంత్ వైఖరి మెత్తబడిందని, గతంలో రాజకీయాలంటే ఆమడ దూరంలో ఉన్న రజనీ కాంత్.. ఇప్పుడు భగవంతుడు ఆదేశిస్తే వస్తానంటున్నారని మాజీ ఎంపీ, రెబల్ స్టార్ కృష్ణంరాజు అన్నారు.
రజనీకాంత్ బీజేపీలో చేరితే తమిళనాడులోనే కాక దక్షిణాది మొత్తం పార్టీ మరింత బలపడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దుమ్ములపేట రాజీవ్ గృహకల్ప సమీపంలో ఆయన సతీసమేతంగా రోడ్లు ఊడ్చారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆ ప్రాంత వాసులకు సూచించారు.