ఎన్నాళ్లో వేచిన హృదయం.. అంటూ మందుబాబులు వైన్ షాపుల ముందు కిలోమీటర్ల క్యూ కడుతున్నారు. తామేమీ తక్కువ కాదంటూ మహిళలూ లైన్‌లో నిలబడుతున్న ఫొటోలను చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీతి సింగ్ కూడా ఓ షాపు దగ్గర మందు బాటిల్ కొనేసిందంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది. అసలు విషయానికి వస్తే ప్రస్తుతం రకుల్ ముంబైలో ఉంటోంది. ఈ క్రమంలో ఆమె బాంద్రాలోని మెడికల్ స్టోర్‌కు వెళ్లి, అక్కడ తనకవసరమైన సిరప్ బాటిల్స్ సహా కొన్ని మందులు తీసుకుని రోడ్డు దాటి వెళ్లిపోయింది. దీన్ని ఓ వ్యక్తి వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. (అతని వల్లే అన్నీ కోల్పోయా: రకుల్)
అయితే కొందరు.. ఆమె మందు బాటిల్ తీసుకెళుతుందంటూ దరువేసి మరీ అసత్య ప్రచారానికి దిగుతున్నారు. 'రకుల్ కూడా మందు షాపులు ఎప్పుడెప్పుడు తెరుస్తారా? అని ఎదురు చూసిందం'టూ పుకార్లకు మెరుగులద్ది మరీ ప్రచారం చేస్తున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన హీరోయిన్ అభిమానులు 'మందు షాపుకు, మెడికల్ షాపుకు తేడా తెలియట్లేదా?' అని విరుచుకుపడుతున్నారు. 'నిజానిజాలు తెలుసుకుని మాట్లాడండి' అంటూ పుకారురాయుళ్లపై ఫైర్ అవుతున్నారు. అటు రకుల్ కూడా పూర్తిగా ఫిట్‌నెస్‌పైనే దృష్టి కేంద్రీకరించిన విషయం తెలిసిందే. (రకుల్ టీ షర్ట్ చాలెంజ్.. ఇలా కూడా వేసుకుంటారా..!)
Comments
Please login to add a commentAdd a comment