ఇళయదళపతితో డ్యూయెట్లకు సై | Rakul Preet Singh romance with Vijay ilayathalapathy 61th movie | Sakshi
Sakshi News home page

ఇళయదళపతితో డ్యూయెట్లకు సై

Published Wed, Apr 5 2017 2:40 AM | Last Updated on Tue, Sep 5 2017 7:56 AM

ఇళయదళపతితో డ్యూయెట్లకు సై

ఇళయదళపతితో డ్యూయెట్లకు సై

ఇళయదళపతి విజయ్‌తో యువళగీతాలు పాడే అవకాశం నటి రకుల్‌ప్రీతిసింగ్‌ను వరించనుందా? దీనికి కోలీవుడ్‌లో అలాంటి అవకాశం ఉందనే సమాధానం వస్తోంది. విజయ్‌ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తన 61వ చిత్రంలో నటిస్తున్నారు. దీనికి దళపతి, మూండ్రుముగం పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాజల్‌అగర్వాల్, సమంత, నిత్యామీనన్‌ ముగ్గురు బ్యూటీస్‌ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది.

 దీంతో విజయ్‌ తదుపరి చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు ప్రచారం జరగుతోంది. ఇంతకు ముందు తుపాకి, కత్తి చిత్రాలను తెరకెక్కించిన ఏ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో ముచ్చటగా మూడోసారి నటించడానికి విజయ్‌ రెడీ అవుతున్నారు. ఈ చిత్రం ఆగస్ట్‌లో ప్రారంభం కానున్నట్లు తాజా సమాచారం. ఏఆర్‌.మురుగదాస్‌ ప్రస్తుతం మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రాన్ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. దీనికి సంభవామి అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. ఈ చిత్రం తరువాత విజయ్‌ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.

ఇందులో కథానాయకిగా నటించే అవకాశం నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌ను వరించబోతున్నట్లు తాజా సమాచారం. అయితే కోలీవుడ్‌లో ఈ అమ్మడికి సెకండ్‌ ఇన్నింగ్స్‌ కొనసాగుతోందని చెప్పవచ్చు. తడయారు తాక్కు చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయిన పంజాబీ భామ రకుల్‌ప్రీత్‌సింగ్‌. ఆ చిత్రంతో పాటు ఆ తరువాత నటించిన ఎన్నమో ఏమో, పుత్తగం చిత్రాలు నిరాశ పరచడంతో అమ్మడిని కోలీవుడ్‌ ఐరన్‌ లెగ్‌ నటిగా ముద్రవేసి పక్కన పెట్టేసింది.

 అయితే టాలీవుడ్‌ మాత్రం అందలం ఎక్కించింది. అక్కడ ఇప్పుడీ ముద్దుగుమ్మ టాప్‌ హీరోయిన్లలో ఒకరు. దీంతో కోలీవుడ్‌ మళ్లీ ఎర్ర తివాచీ పరుస్తోంది. ఇప్పటికే కార్తీకి జంటగా ధీరన్‌ అధ్యాయం ఒండ్రు చిత్రంలో నటిస్తున్న రకుల్‌ప్రీత్‌సింగ్‌ విజయ్‌తో డ్యూయెట్లు పాడే అదృష్టం లభించనున్నట్లు టాక్‌. ఏఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వం వహిస్తున్న తెలుగు చిత్రంలో కథానాయకి రకుల్‌ప్రీత్‌సింగ్‌ అన్నది గమనార్హం. అలా విజయ్‌కు జంటగా నటించే అవకాశాన్ని ఈ దర్శకుడే కల్పించనున్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement