
కరోనా వైరస్ కారణంగా దేశం మొత్తం ఇళ్లలో బందీ అయ్యింది. లాక్ డౌన్ తో ఇళ్లకే పరిమితమైన జనాలు.. బోర్ కొడుతుండడంతో సోషల్ మీడియాలో రకరకాల చాలెంజెస్ పేరుతో సరదాగా టైమ్ పాస్ చేస్తున్నారు. సెలబ్రెటీలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ టీ షర్ట్ చాలెంజ్‌ను తీసుకొచ్చింది. తలకిందులుగా నిల్చుని.. టీషర్ట్ వేసుకుంటూ, మీరూ ట్రై చేయండంటూ తన ఇన్ స్టాగ్రామ్ లో వీడియో పోస్ట్ చేసింది.
రెగ్యులర్ గా టీషర్ట్ తొడుక్కోవడం బోర్ గా ఉందని చెబుతూ క్యాప్షన్ పెట్టింది. #quarantinelife, #weekendchallenge అన్న హ్యాష్ ట్యాగ్స్ తో తన ట్రైనర్ అనుష్క పర్వాని, రియా చక్రవర్తి, బాలీవుడ్ నటి ఆకాంక్ష రంజన్ కపూర్కి చాలెంజ్ విసిరింది. ఇస్ట్రాంగ్ గా ఉండడమే సెక్సీ అంటూ #strongisthenewsexy #strongereveryday హ్యాష్ ట్యాగ్స్ తో వీడియో పోస్ట్ చేసింది. శనివారం ఉదయం రకుల్ ఈ వీడియో షేర్ చేసిన కొద్ది గంటలకే 11 లక్షల వ్యూస్ వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment