Sye Raa Narasimha Reddy Release Date, Announced by Ram Charan at VVR Promotion - Sakshi
Sakshi News home page

Published Tue, Jan 8 2019 3:22 PM | Last Updated on Tue, Jan 8 2019 4:52 PM

Ram Charan Announce Chiranjeevi Sye Raa Release Date - Sakshi

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. ఆంగ్లేయులను ఎందిరించిన మొట్ట మొదటి తెలుగు నాయకుడిగా పేరు తెచ్చుకున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సురేందర్‌ రెడ్డి దర్శకుడు. తల్లి కోరిక మేరకు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ భారీ బడ్జెట్‌తో తన తండ్రికి కానుకగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో సైరా తెరకెక్కుతున్నట్టుగా తెలుస్తోంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి అభిమానులకు ఓ అప్‌డేట్ ఇచ్చాడు చరణ్‌. వినయ విధేయ రామ సినిమా ప్రమోషన్‌ సందర్భంగా మీడియాతో మాట్లాడిన చరణ్‌, సైరాను దసరా సందర్భంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టుగా వెల్లడించారు. ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో చిరు సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా అమితాబ్‌ బచ్చన్‌, జగపతి బాబు, తమన్నా, సుధీప్‌, విజయ్‌ సేతుపతిలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement