బాహుబలి ఇచ్చిన ఇన్సిపిరేషన్తో చాలా మంది నిర్మాతలు భారీ బడ్జెట్ చిత్రాలను ఎనౌన్స్ చేస్తున్నారు. టాలీవుడ్ లోనూ భారీ చిత్రాలకు సంబంధించిన ఎనౌన్స్మెంట్స్ వస్తున్నాయి. మెగా నిర్మాత అల్లు అరవింద్ 500 కోట్ల బడ్జెట్తో రామాయణాన్ని తెరకెక్కిస్తున్నట్టుగా ఎనౌన్స్ చేశాడు. ఈ సినిమాలో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ నటించనున్నారు. అయితే రాముడిగా ఎవరు నటించనున్నారని సినీ జనాలు చర్చించుకుంటున్నారు.
మెగా అభిమానులు మరో అడుగు ముందుకేసి రామ్ చరణ్ రాముడిగా నటిస్తాడనిచెపుతున్నారు. అంతేకాదు. సిక్స్ ప్యాక్ రాముడిగా రామ్ చరణ్ పోస్టర్ను కూడా డిజైన్ చేసి సోషల్ మీడియాలో సర్య్కూలేట్ చేస్తున్నారు. అఫీషియల్ కాకపోయినా.. అభిమానులు భారీ ప్రాజెక్ట్లో తమ అభిమాన నటుణ్ని చూసుకొని మురిపోతున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న మెగా రామాయణం ప్రాజెక్ట్ పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.