లెజెండరీ డైరెక్టర్తో మెగా హీరో..?
ఎక్కువగా మూస కమర్షియల్ ఫార్ములా సినిమాలు చేస్తూ వచ్చిన మెగా హీరో రామ్ చరణ్ ఇప్పుడు రూట్ మార్చాడు. వరుసగా ఒకే రకం సినిమాలు చేయటంతో అభిమానులతో పాటు చరణ్ కూడా బోర్ ఫీల్ అయ్యాడు. అందుకే ధృవ సినిమాలో కొత్తగా ట్రై చేసిన చెర్రీ మంచి విజయం సాధించాడు. దీంతో అదే ఫార్ములాను రాబోయే సినిమాల విషయంలో కూడా కంటిన్యూ చేసే ఆలోచనలో ఉన్నాడు.
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ లవ్ స్టోరిలో నటిస్తున్నాడు చరణ్. వీలేజ్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా కనిపించనున్నాడట. సమంత హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా తరువాత కూడా మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. మాస్ యాక్షన్ ఇమేజ్ ఉన్న చెర్రీ, క్లాస్ రొమాంటిక్ ఎంటర్టైనర్లను తెరకెక్కించే మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు.
ఇటీవల 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షూట్ కోసం సుహాసినితో పాటు హైదరబాద్ వచ్చిన మణిరత్నం చిరంజీవి, రామ్ చరణ్లతో సినిమా గురించి చర్చించాడట. చరణ్ కూడా మణిరత్నం దర్శకత్వంలో నటించేందుకు ఇంట్రస్ట్ చూపించటంతో త్వరలోనే ఈ సినిమాపై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే చాన్స్ కనిపిస్తోంది. ప్రస్తుతం కార్తీ హీరోగా చెలియా సినిమాను పూర్తి చేసిన మణిరత్నం, చరణ్తో చేయబోయే సినిమాకు లోకేషన్ల వేట కూడా మొదలెట్టాడట.