రామ్ చరణ్ సినిమా ఆగిపోయిందా..?
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పీరియాడిక్ లవ్ స్టోరీలో నటిస్తున్న రామ్ చరణ్, ఆ సినిమా తరువాత మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని భావించాడు. చాలా కాలం క్రితమే ఈ ప్రాజెక్ట్ కోసం ప్రయత్నాలు జరిగినా.. ప్రయోగం చేయడానికి ఇష్టపడని చరణ్, వాయిదా వేస్తూ వచ్చాడు. ధృవ సినిమా విషయంలో ప్రయోగం వర్క్ అవుట్ కావటంతో తరువాతి సినిమాల విషయంలో కూడా ఇమేజ్ను పక్కన పెట్టి సినిమాలు ఎంచుకుంటూన్నాడు.
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో కూడా పల్లెటూరి యువకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఆ తరువాత మణిరత్నం దర్శకత్వంలో ఓ క్లాస్ రొమాంటిక్ లవ్ స్టోరికి ఓకె చెప్పాడు. అయితే మణిరత్నం దర్శకత్వంలో ఇటీవల విడుదలైన చెలియాకు డిజాస్టర్ టాక్ రావటంతో చెర్రీ ఆలోచనలో పడ్డాడు. దీంతో మణిరత్నం కూడా మనసు మార్చుకున్నట్టుగా తెలుస్తోంది.
ప్రస్తుతానికి రామ్ చరణ్ సినిమాను హోల్డ్లో పెట్టి ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్ను పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్లు జంటగా సినిమాను తెరకెక్కించాలని భావిస్తున్నాడు. ఇప్పటికే వారికి కథ కూడా వినిపించిన మణి, త్వరలోనే ప్రాజెక్ట్ను సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు. అయితే ఆ తరువాతైన చరణ్, మణిరత్నం సినిమాలో నటిస్తాడో లేదో చూడాలి.