
రామ్‌గోపాల్ వర్మ.. ఈ పేరే ఒక సంచలనం. ఏ సినిమా తీసినా.. అందులో తన మార్క్ కనిపించేలా తెరకెక్కించడమే ఆర్జీవీ ప్రత్యేకం. ఆయన సినిమాలే కాదు.. రియల్ లైఫ్‌లో ఆర్జీవీ తీరూ ప్రత్యేకమే. అయితే గత కొన్నేళ్లుగా సరైన సినిమాను ప్రేక్షకులను అందించలేకపోతున్నారని అభిమానులు నిరాశపడుతున్నారు. అయితే మళ్లీ ఆర్జీవీ ‘భైరవగీత’తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమయ్యారు.
అయితే ఈ చిత్రం నుంచి రీసెంట్‌గా మరో ట్రైలర్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఆర్జీవీ స్టైల్లోనే సాగుతున్న ఈ మూవీ ట్రైలర్‌లో.. అన్ని ఎమోషన్స్‌ను హైరేంజ్‌లోనే చూపెట్టాడు. ఆర్జీవీ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ మూవీకి వర్మశిష్యుడు సిద్ధార్థ్ తాతోలు దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రచార బాధ్యతలను వర్మ దగ్గరుండి చూసుకుంటున్నాడు.
ఆలోచనను...ఆలోచించిన మనిషిని చంపలేకపోతే ఏం చెయ్యాలి....ఆ ఆలోచన ఎవరి గురించో వారిని చంపేయాలి..అంటూ వినిపించిన డైలాగ్‌లు బాగున్నాయి. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ ఫ్యాక్షన్ ప్రేమకథలో ధనుంజయ్, ఇర్రా మోర్‌లు హీరో హీరోయిన్లు నటించారు. ఈ చిత్రం నవంబర్ 22న విడుదలకానుంది.
Comments
Please login to add a commentAdd a comment