టీచర్స్డే పై వర్మ కామెంట్
వివాదాల కోసమే వ్యాఖ్యలు చేసే ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్వర్మ మరోసారి తనదైన ట్వీట్ లతో చెలరేగిపోయాడు. గురు పూజోత్సవం సందర్భంగా ఆయన గురువుల పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. 'నా జీవితంలో ఎవరికీ హ్యాపీ టీచర్స్ డే అని చెప్పను, ఎందుకంటే నేను ఒక్క రోజు కూడా నా గురువులతో సంతోషంగా లేను. సక్సెస్ఫుల్ ఇంజనీర్స్, సక్సెస్ఫుల్ డాక్టర్స్ ఉన్నారు గాని, ఎక్కడైన సక్సెస్ఫుల్ టీచర్స్ ఉన్నారా.? కరణ్ జోహార్ 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్' సినిమా చేసినట్టుగా ఎవరైనా టీచర్ ఆఫ్ ద ఇయర్ అనే సినిమా చేస్తే అది డిజాస్టర్ ఆఫ్ ద ఇయర్ అవుతుంది' అంటూ కామెంట్ చేశాడు.
సినీ రంగంలోనే ఉపాధ్యాయ వృత్తిని తక్కువగా చూపిస్తున్న విషయాన్ని మరిచిపోయిన వర్మ ఇలాంటి కామెంట్స్ చేయటం మరోసారి వివాదాలకు కేంద్ర బిందువయ్యాయి. అయితే వర్మ చేస్తున్న రెగ్యులర్ కామెంట్స్ కు అలవాటు పడ్డ రీడర్స్ మాత్రం లైట్ గా తీసుకుంటున్నారు.
I cant say 'Happy teachers day' cos there wasn't a single day I was happy with my teachers
— Ram Gopal Varma (@RGVzoomin) September 5, 2013
If someone takes off from Karan johar's Student of the year and makes Teacher of the year it will become the Disaster of the year
— Ram Gopal Varma (@RGVzoomin) September 5, 2013